బాలీవుడ్ స్టార్ హాట్ బ్యూటీ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హీరోయిన్ గా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ రూపొందిన విషయం తెల్సిందే.సెకండ్ వేవ్ కు ముందే షూటింగ్ పూర్తి అయ్యింది.
ప్యాచ్ వర్క్ ఉంటే ఒకటి రెండు రోజుల క్రితం పూర్తి చేశారు.ఇక ఈ సినిమా కు సంబంధించిన విడుదల విషయమై ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తాజాగా ఈ సినిమా తమిళ వర్షన్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. తెలుగు మరియు హిందీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
జులై నెల ఆరంభం కు ముందు తలైవి సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేయాలని భావిస్తున్నారు.అందుకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
,/br>
తలైవి సినిమా చిత్రీకరణ విషయం లో కాస్త ఆలస్యం జరిగింది.కరోనా వల్ల విడుదల వాయిదా పడింది.
ఇన్నాళ్లు షూటింగ్ లు జరగక పోవడం వల్ల సినిమా ఆలస్యం అయ్యింది.ఇప్పుడు షూటింగ్ ముగియడం వల్ల విడుదల ను వాయిదా వేయాలని మేకర్స్ భావించడం లేదు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం తలైవి సినిమా సెన్సార్ కార్యక్రమాలు ముగించి ఆగస్టు లో లేదా అంతకు ముందే విడుదల చేయాలని భావిస్తున్నారు.మరో వైపు తలైవి సినిమా విడుదల కు ఓటీటీ తో కూడా చర్చలు జరుపుతున్నారట.
విడుదల విషయంలో ఎలాంటి అనుమానం లేకుండా జులై లేదా ఆగస్టులో సినిమా ను విడుదల చేసేలా రెండు ప్లాన్స్ ను సిద్దం చేశారు.థియేటర్లు ఓపెన్ కాక పోవడం లేదంటే థర్డ్ వేవ్ వస్తే అప్పుడు ఓటీటీకి వెళ్తారని తెలుస్తోంది.తమిళనాడు ప్రజలు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా జనాలు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.