ఢిల్లీ సర్కారు స్పోర్ట్స్ యూనివరిస్టీ ఏర్పాటుకి రంగం సిద్ధం చేసింది.దేశ రాజధానిలో ఏర్పాటు చేస్తున్న ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీలో వైఎస్ చాన్సలర్ గా ఏపీకి చెందిన ప్రఖ్యాత వెయిట్ లిఫ్టర్ పద్మశ్రీ కరణం మల్లీశ్వరిని నియమించారు.
ఈ మేరకు ఆప్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఆమె మొదటి వీసీ అవుతారని ఉత్తర్వుల్లో చెప్పుకొచ్చారు.
త్వరలోనే దీనికి సంబంధించిన విధానాలు మొదలు పెడతారని చెప్పారు.
ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీలో ఆటగాళ్లు తాము ఎంచుకున్న క్రీడలో డిగ్రీ పొందవచ్చని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా చెప్పారు.
మరే డిగ్రీ చేయాల్సిన అవసరం లేకుండా ఈ డిగ్రీ సరిపోతుందని అన్నారు.ఒలంపిక్ క్రీడల్లో దేశానికి కనీసం 50 స్వర్ణ పతకాలు తెచ్చేలా క్రీడాకారులను తీర్చిదిద్దడమే ఈ యూనివర్సిటీ ముఖ్య ఉద్దేశమని చెప్పారు.
ఢిల్లీ స్పోర్ట్స్ యూనివరిస్టీ క్రీడారంగంలో దేశం గర్వించేలా చేస్తుందని చెప్పారు.డిగ్రీ స్థాయి నుండి పీ.హెచ్.డీ వరకు వివిధ క్రీడల్లో వర్సిటీ కోర్సులు ఉంటాయని వెల్లడించారు.
ఢిల్లీలో మొదలు పెడుతున్న ఈ యూనివర్సిటీ ఎంతోమంది ఔత్సాహిక క్రీడాకారులకు మంచి అవకాశమని చెప్పొచ్చు.తప్పకుండా అక్కడ డిగ్రీ పొందే అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగ పరచుకునేలా చేస్తున్నారు.







