భారత మహిళా క్రికెట్ క్రీడాకారులు చరిత్ర నెలకొల్పారు.ఉన్న ప్లేయర్లందరూ టెస్టు మ్యాచుకు కొత్తే.
ఇండియా మహిళా క్రికెట్ టీమ్ లో ఉన్నటువంటి 8 మంది క్రీడాకారిణులకు ఇదే తొలి టెస్టుగా ఉంది.అయినా కూడా భారత జట్టు అద్బుతంగా ఆడింది.
ఇంగ్లండ్ పై జరిగిన ఈ మ్యాచ్ ను డ్రాగా ముగించింది.అందరూ ఈ టెస్టు మ్యాచులో ఇంగ్లండ్ టీమే విన్నర్ అవుతుందని ఊహించారు.
అయనప్పటికీ భారత క్రీడాకారినులు మంచి ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ ను విజయం దిశగా సాగించారు.చివరికి డ్రాగా మ్యాచ్ ముగిసింది.
నాలుగు రోజుల పాటు జరిగిన ఈ మ్యాచులో మొదట తొలుత ఇంగ్లండ్ బ్యాటింగ్ గు దిగింది.ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 396/9 పరుగులు చేసింది.
ఆ తర్వాత ఇంగ్లండ్ టీము డిక్లేర్ ఇచ్చేసింది.మొదటి ఇన్నింగ్స్‌లో భారత క్రీడాకారులలో బౌలర్లు స్నేహ్ రాణాకి 4, దీప్తి శర్మ 3 వికెట్లను తీసి జట్టును ఆదుకున్నారు.
ఇంగ్లాండ్ కెప్టెన్ నైట్ 95 పరుగులు సోఫియా డంక్లీ 74 పరుగులు బీమోంట్ 66 పరుగులు చేసి తమ జట్టును నిలబెట్టారు.ఆ తర్వాత భారత యంగ్ గన్ షెఫాలీ వర్మ 96 పరుగులు చేసి సంచలనం రేపింది.
స్మృతి మంధాన 78 పరుగులు ఇచ్చి భారత జట్టును ముందుకు నడిపించారు.భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో మొదటి వికెట్ కి 167 పరుగులను జోడించారు.సీనియర్ ఆటగాళ్లు అయిన మిథాలీ రాజ్ 2, హర్మన్‌ప్రీత్ కౌర్ 4, పూనమ్ రౌత్ 2 పరుగులు చేసి మ్యాచు నుంచి వెనుదిరిగారు.

దీంతో చివరగా 61 పరుగుల తేడాతో 10 వికెట్లు కోల్పోయిన భారత జట్టు 231 పరుగులకి ఆలౌట్ అయిపోయింది.ఇంగ్లాండ్, భారత జట్టును ఫాలోఆన్ కు అవకాశం ఇచ్చిన తర్వాత షెఫాలీ వర్మ 83 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 63 పరుగులు చేసి రికార్డు నెలకొల్పింది.రెండు ఇన్నింగ్స్‌లో 50 పరుగులకు పైగా చేసిన తొలి మహిళ క్రికెటర్‌గా షెఫాలీ వర్మ రికార్డు నెలకొల్పింది.
సీనియర్లు అంతగా ఆడలేకపోయినా తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్న షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, తానియా భాటియా అద్భుతంగా ఆడారు.ఇంకో రోజు ఉన్నట్లైతే భారత జట్టు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉండేవి.
మొత్తానికి భారత మహిళా క్రికెట్ జట్టు విజయపంథాతో దూసుకుపోతోంది.