లైసెన్స్ అక్కర్లేదు...వివాదాస్పద నిర్ణయం తీసుకున్న అమెరికా...!!!

అమెరికాలో గన్ కల్చర్ రోజు రోజుకు హెచ్చు మీరుతోంది.ఎదో ఒక మూల తుపాకి పేలిన ఘటనలు రోజూ వినిపిస్తూనే ఉంటాయి.

ఎంతో మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతూనే ఉన్నాయి.స్కూల్ పిల్లలు మొదలు, కాలేజీ కి వెళ్ళే వారు, ఇలా ప్రతీ ఒక్కరూ తూపాకులను పెన్నులు వాడినట్టు వాడేస్తూ నేరస్తులుగా మారుతున్నారు, వారి భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు.

ఈ పరిస్థితుల నేపధ్యంలో అమెరికాలోని గన్ కల్చర్ కు వ్యతిరేకంగా ఎన్నో ఏళ్ళుగా ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి.గన్ కల్చర్ ను నిషేధించాలని సెనేట్ లో తీర్మానం జరగాలని పట్టుబడుతున్నా కార్యరూపం దాల్చడం లేదు చివరికి అధ్యక్షుడు బిడెన్ సైతం గన్ కల్చర్ ను నిషేధించే దిశగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు.

కానీ అమెరికాలో కీలక రాష్ట్రమైన టెక్సాస్ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు వివాదాస్పదమైన నిర్ణయం తీసుకుంది. గన్ కల్చర్ పై నిషేధం విదించే దిశగా అధ్యక్షుడు అడుగులు వేస్తున్న క్రమంలో టెక్సాస్ మాత్రం తమ రాష్ట్ర ప్రజలు లైసెన్స్ లేకపోయినా తుపాకీ వాడేయచ్చు అంటూ వివాదాస్పద ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

అంతేకాదు ఇందుకు గాను బిల్లును కూడా రెడీ చేయగా టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబోట్ బిల్లును ఆమోదిస్తూ సంతకం చేశారు.

దాంతో సెప్టెంబర్ 1 నుంచీ సదరు రాష్ట్ర ప్రజలు లైసెన్స్ లు లేకపోయినా యదేశ్చగా తుపాకులు వాడెయచ్చట.అయితే టెక్సాస్ ప్రజలు కేవలం హ్యాండ్ గన్ మాత్రమే వాడేందుకు అవకాశం ఉండేట్టుగా ఈ బిల్లును రూపొందించారని, హ్యాండ్ గన్ ను ఉపయోగించారని తెలిపారట.అయితే ఇందులో కొన్ని నిభందనలు కూడా పొందుపరిచారట.21 ఏళ్ళు పైబడిన వారు మాత్రమే తుపాకిని వాడాలని, అందులోనూ వారిపై గతంలో ఎలాంటి కేసులు, ఆరోపణలు లేకుండా ఉండాలని అలాంటి వారికి మాత్రమే అనుమతులు ఉన్నాయని, అనుమతులు లేనివారి తుపాకి వాడితే కటినమైన శిక్షలు విధిస్తామని హెచ్చరించారట.అయితే టెక్సాస్ తీసుకున్న నిర్ణయం పై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి, అసలు గన్ కల్చర్ పై బ్యాన్ విధించాలని కోరుతుంటే లైసెన్స్ లేకుండా తుపాకి వాడమని చెప్తున్నారని నిరసనలు వ్యక్తం చేస్తున్నారట.

ఈ విపరీత ధోరణి ఇంకేంతకు దారి తీస్తుందో నని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ప్రజా సంఘాలు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు