రైతులను అన్యాయం చెయ్యొద్దు అంటూ జగన్ కి లెటర్ రాసిన చంద్రబాబు..!!

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు రైతులకు ప్రభుత్వం ధాన్యం బకాయిలు చెల్లించకపోవడం పై మండిపడ్డారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ కి లెటర్ రాసి ప్రభుత్వం వెంటనే రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించాలని వారికి అన్యాయం చేయొద్దు అంటూ స్పష్టం చేశారు.

అదే రీతిలో ధాన్యానికి మద్దతు ధర కొనుగోలు విషయంలో  ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందని తెలిపారు.రైతు ప్రభుత్వం అంటూ చెప్పుకొనే వైసీపీ.

రైతులకు సరైన రీతిలో న్యాయం చేయడం లేదని మండిపడ్డారు.తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే వారి ఖాతాలో డబ్బులు పడేది అని పేర్కొన్నారు.

అయితే ప్రస్తుతం రైతుల దగ్గర ప్రభుత్వం.ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత దాదాపు రెండు నెలలకి  నగదు జమ చేయడానికి.

Advertisement

సమయం పడుతుందని విమర్శించారు.గోదావరి జిల్లాలో ఉన్న రైతులకి  భారీగా ప్రభుత్వం బకాయిలు పడిందని వెంటనే చెల్లించాలని తెలిపారు.

రైతుల వద్ద ధాన్యం కొనుగోలు విషయంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు.

గోదావరి జిల్లాలో మాత్రమేగాక రాయలసీమ ప్రాంతంలో వేరుశనగ పంట విషయంలో కూడా రైతులకు రాయితీ అందలేదని తెలిపారు.కౌలు రైతులకు కూడా వైసిపి ప్రభుత్వం అన్యాయం చేస్తుందని రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని సీఎం జగన్కి  చంద్రబాబు లెటర్ రాశారు. .

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు