ఈరోజు తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.ఇక రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతలు వర్సెస్ ఈటల మధ్య మాటల పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది.
మొత్తానికి ఈటల పార్టీ మారి తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త రాజకీయానికి తెరతీస్తారా లేదా చూడాలి.ఇకపోతే ఇప్పటికే ఈటల వ్యవహారం, పార్టీ మారడం వంటి అంశాల పై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.
ఈ క్రమంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈటలను పార్టీ ఎంతగానో గౌరవించిన ఆయన మాత్రం పార్టీ ప్రతిష్ట దిగజారేలా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు.
అంతే కాకుండా ఈటలను ప్రగతి భవన్‌లోకి రానివ్వలేదని ప్రచారం చేస్తున్నారు.ఒకవేళ ఇదే నిజం అయితే మరి అప్పుడే ఎందుకు రాజీనామా చేయలేదని ఆయన ప్రశ్నించారు కాగా టీఆర్ఎస్ పార్టీలో సముచిత స్దానాన్ని కల్పించిన అన్నీ కల్పిత వార్తలు ప్రచారం చేస్తూ ఈటల కేసీఆర్‌పై ఎన్నో అసత్య ప్రచారాలకు తెరదీశారని పల్లా రాజేశ్వర్ రెడ్డి మండి పడుతున్నారు.







