టాలీవుడ్ ముద్దుగుమ్మ మహానటి ఫేమ్ కీర్తి సురేష్.మంచి క్రేజ్ సంపాదించుకున్న కీర్తి.
స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హోదా ను అందుకుంది.అంతేకాకుండా టాలీవుడ్ లో వరుస సినిమాలో ఓ రేంజ్ లో అవకాశాలు అందుకుంటోంది.
మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ కెరీర్ మొత్తం మలుపు తిరిగిందనే చెప్పవచ్చు.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
తనకు సంబంధించిన ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది.
ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
అంతేకాకుండా లేడీ ఓరియంటెడ్ నేపథ్యంలో తెరకెక్కనున్న గుడ్ లక్ సినిమాలో నటిస్తుంది.ఇక ఈ సినిమా విడుదలకు కూడా సిద్ధంగా ఉంది.మలయాళం, తమిళంలో కూడా వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.ఇదిలా ఉంటే కీర్తి సురేష్ సూర్యనమస్కారాలతో మంచి విషయాన్ని పంచుకుంది.

ఎంతో మంది హీరోయిన్స్ ఆరోగ్యం, అందం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.శరీర ఆకృతిలో మార్పులు రాకుండా వర్కౌట్లు చేస్తూ బిజీగా ఉంటారు.ఇక ఉద్యోగాలు చేస్తూ మరింత లుక్ ను అందుకుంటారు.ఈ నేపథ్యంలో కీర్తి సురేష్ కూడా ఇప్పుడు ఈ దారినే ఎంచుకుంది.తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫోటో షేర్ చేయగా అందులో ఈ బ్యూటీ ఉదయాన్నే యోగా చేస్తూ కనిపించింది.అంతేకాకుండా సూర్య నమస్కారాలు చేస్తూ బాగా ఆకట్టుకుంది.

ఇక ఈ కష్టకాలంలో మనశ్శాంతికి మానసిక ఆనందానికి మంచి ఆరోగ్యానికి ఇలా చేయడం అవసరం అంటూ కీర్తి సురేష్ పంచుకుంది.ఇంట్లోనే తక్కువ స్థలంలో సూర్య నమస్కారాలు యోగ ప్రాక్టీస్ కి ఎవరికైనా అవకాశం ఉంటుందని, విధిగా ప్రతి ఒక్కరు ఇలాంటివి అనుసరించాలని అంటుంది కీర్తి.