వైద్యుల‌కు గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. !

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం వైద్యుల‌కు శుభ‌వార్త చెబుతుంది.క‌రోనా స‌మ‌యంలో చేసిన కృషికి గాను సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచాలని నిర్ణ‌యం తీసుకున్నట్లుగా వెల్లడించింది.

ఈ విషయాన్ని ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్ మీడియా ముఖంగా తెలిపారు.ఇకపోతే సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు ప్రస్తుతం వస్తున్న స్టైఫండ్ రూ.45 వేల నుంచి రూ.70 వేలకు పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణ‌యించిన‌ట్టు వెల్లడించారు.ఇక జూనియ‌ర్ డాక్ట‌ర్ల డిమాండ్ల పై కూడా చర్చలు సాగుతున్నాయని, త్వరలో ఏ నిర్ణయం అనేది వెల్లడిస్తామని తెలియచేశారు.

కాగా ప్రస్తుతం కరోనా విధుల్లో సుమారు 350 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు తమ సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తాజాగా సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచిన విషయం తెలిసిందే.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు