ఉత్కంఠగా మారిన ఎమ్మెల్సీ గుత్తా రెండో దఫా నియామకం... పదవి దక్కేనా?

కేసీఆర్ లాంటి అపర చాణక్యుడు తెలంగాణ రాజకీయాల్లో మరో నేత లేడనడంలో ఆశ్చర్యం లేదు.

ఎందుకంటే ఇప్పటి వరకు కేసీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక చాలా పెద్ద వ్యూహం ఉంటుంది.

ప్రస్తుతం ఎమ్మెల్సీ గుత్తా సుఖేంధర్ రెడ్డి పదవీకాలం ముగుస్తోంది.అలాగే కేసీఆర్ ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఉత్కంఠగా మారింది.

ఒక సంవత్సరం క్రిందటి రాజకీయ పరిస్థితులకు ఇప్పటి రాజకీయ పరిస్థితులకు చాలా తేడా ఉన్నది.అయితే ఇప్పటికే ఏ చిన్న పదవి గురించైనా ఆశావహులు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది.

కాంగ్రెస్ నుండి వచ్చి ఎమ్మెల్సీ పదవి పొందడంతో అప్పుడే టీఆర్ఎస్ లో ఉన్న మిగతా నేతలు గుర్రుగా ఉన్న పరిస్థితి ఉంది.కాని ఇప్పుడు కూడా రెండో సారి కూడా గుత్తాకు పదవి ఇస్తే టీఆర్ఎస్ లో అసంతృప్తి జ్వాలలు పెల్లుబికే అవకాశం ఉంది.

Advertisement

ఇవన్నీ కెసీఆర్ కు తెలియనిది కాదు.అందుకే ఇప్పటికిప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికపై నిర్ణయం తీసుకుంటే అవకాశం లేదు.

అయితే ఇప్పుడు ఈ విషయంలో కెసీఆర్ తీసుకునే ఈ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ఈ విషయంపై ఇప్పటికీ గుత్తా స్పందించకపోయినా జరిగే పరిణామాలను ఎవరికి వారు విశ్లేషించుకుంటున్నారు.

మరి కెసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడనేది చూడాల్సి ఉంది.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు