గతేడాది నుంచి ఓ పేరు దేశం మొత్తం మారుమోగి పోతోంది.ఈ ప్రాంతం, ఆ ఏరియా అనే తేడా లేకుండా అంతా ఆయన్ను కొలుస్తున్నారు.
గతేడాది లాక్డౌన్ పెట్టినప్పుడు వేల మంది కూలీలకు రవానా సౌకర్యం ఏర్పాటు చేసి వాళ్ల ఇంటికి పంపించాడు సోనూసూద్.అప్పటి నుంచి ఎవరికి కష్టం వచ్చినా తనవంతుగా సాయం అందిస్తూనే ఉన్నారు.
ఇప్పుడు సెకండ్ వేవ్‌లో ఆయన ఎన్నో సేవలు అందిస్తున్నారు.
దేశంలో ఎక్కడ ఏ అవసరం వచ్చినా అంతా సోనూసూద్‌కే ఫోన్ చేస్తున్నారు.
ఆక్సిజన్, రెమిడెసివిర్, బెడ్లు, ఇతర మెడిసిన్లు ఇలా ఏ కష్టం వచ్చినా అందరూ సోనూసూద్‌నే తలుస్తున్నారు.ఇక ఇప్పుడు ఆక్సిజన్ కొరత ఉండొద్దని ఏకంగా దేశంలో ఆక్సిజన్ ప్లాంట్లను కూడా ఏర్పడు చేస్తున్నాడు.
అయితే వీటి గురించి మాట్లాడిన సోనూసూద్.ఈ కరోనా పరిస్థితుల్లో తమ తల్లిదండ్రులను ఊహించుకుని బాధపడ్డారు.
తన తల్లిదండ్రులు బతికుంటే వారికి బెడ్లు, ఆక్సిజన్, ఇతర మెడిసిన్లు అందక వారు ఇబ్బంది పడుతుంటే తాను చూసి తట్టుకునేవాడిని కాదంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సేవలు అందిస్తున్నారు సోనూసూద్.ఏకంగా ఏపీ గవర్నమెంట్‌కే ఆక్సిజన్ సాయం అందించాడు.సెలబ్రిటీలకు కూడా తన వంతుగా సాయం అందిస్తూ ఆదుకుంటున్నాడు.
అయితే ఇలాంటి టైమ్‌లో ప్రస్తుత పరిస్థితులు, తమ తల్లిదండ్రుల గురించి ఊహించుకుని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ కష్ట కాలంలో రోజూ కొన్ని వేల మంది తమ కుటుంబీకుల్ని పోగొట్టుకున్న బాధపడటం చూస్తున్నా.
నాకు తెలిసి ఇలాంటి సంక్షోభాన్ని ఇప్పటి వరకు మనం చూసి ఉండం.నా తల్లిదండ్రులే గనక ఇలాంటి టైమ్‌లో బతికుండి బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్ల కోసం పోరాడుతుంటే నా గుండె తట్టుకోలేకపోయేదని బాధపడ్డారు.
సోనూ సూద్ తండ్రి శక్తి సాగర్ సూద్ పంజాబ్‌లో పెద్ద బిజినెస్ పర్సన్.పేదోళ్లకి సోనూతో కలిసి అన్నం పెట్టేవాడు.
తల్లి సరోజ్ సూద్ కూడా పేద స్టూడెంట్లకు ఉచితంగా చదువు చెప్పేది.వారి నుంచే సోనూకి సేవలు అలవాటయ్యాయి.
కాగా వారిద్దరూ అనారోగ్యంతో మృతి చెందారు.