రియాల్ హీరోగా పేరు సంపాదించుకున్న సోనూసూద్ తెలుగు రాష్ట్రాల ప్రజల్లో తెచ్చుకున్న మంచిపేరు అంతాఇంతా కాదు.ఏడాది కాలంగా సోనూసూద్ ప్రజలకు తన వంతు సేవలు చేయడంతో పాటు కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకుంటూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.
తాజాగా సోనూసూద్ ఒక సందర్భంలో తన తల్లిదండ్రుల గురించి చెప్పుకొచ్చారు.తన తండ్రి శక్తి సాగర్ పంజాబ్ లో బిజినెస్ చేసేవారని సోనూసూద్ తెలిపారు.
ఎవరైనా ఆకలితో అలమటిస్తుంటే తనతో కలిసి వాళ్లకు ఆహారం అందజేయడంతో పాటు ఇతర సామాగ్రిని అందజేసేవారని ఆయన తెలిపారు.సోనూసూద్ తల్లి సరోజ్ సూద్ పేద విద్యార్థులకు ఫ్రీగా చదువు చెప్పేవారు.
సోనూసూద్ తల్లి, తండ్రి అనారోగ్య సమస్యల వల్ల ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల గురించి మాట్లాడుతూ సోనూసూద్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కరోనా విజృంభణ వల్ల దేశంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన ఎంతోమంది కంటతడిని తాను చూస్తున్నానని సోనూసూద్ అన్నారు.
కరోన వైరస్ ఎంతోమంది హృదయాలను ముక్కలు చేస్తోందని సోనూసూద్ పేర్కొన్నారు.గతంలో ఇటువంటి సంక్షోభాన్ని ఎవరూ చూడలేదని ఆయన వెల్లడించారు.తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రి ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్ల కోసం ఇబ్బందులు పడుతుంటే మాత్రం తాను తట్టుకునే వాడిని కాదని సోనూసూద్ పేర్కొన్నారు.
మరోవైపు సోనూసూద్ చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేక కొంతమంది ఆయనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు.అయితే సోనూసూద్ మాత్రం మౌనంగానే ఉంటూ కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తూ విమర్శలు చేసేవాళ్లకు చెక్ పెడుతున్నారు.
మరోవైపు సోనూసూద్ హీరోగా క్రిష్ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీ ఒకటి తెరకెక్కుతున్న ప్రచారం జరుగుతుండటం గమనార్హం.ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.క్రిష్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.