రాజకీయాల్లో ఉన్న వారు ఒక్కొక్క సారి తీసుకునే నిర్ణయం వల్ల వారి రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడిపోతుందనడాని చక్కని ఉదాహరణ సోనాలి గుహ అంటున్నారు.ఈ మహిళా నేత ముందు టీఎంసీ పార్టీలో ఉండే వారు.
అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీ వీడి బీజేపీలో చేరిపోయారు.ఇక తాజాగా తాను టీఎంసీ పార్టీ వీడి పెద్ద తప్పు చేశానని, దయచేసిన తనను క్షమించి తిరిగి పార్టీలో చేర్చుకోవాలని వేడుకుంటూ ముఖ్యమంత్రి మమతకు లేఖ రాశారు సోనాలి గుహ.
ఇదే కాకుండా ఎక్కడ దీదీ తనను దూరం పెట్టేస్తుందో అనే సందేహంలో ఆ పార్టీలో తాను ఇమడలేక పోతున్నానని, ఉద్వేగంలో తీసుకున్న తప్పుడు నిర్ణయం తనను వేధిస్తోందని, దీదీ నువ్వు లేకుండా నేను ఉండలేను అంటూ ముక్కలైన మనసుతో ఈ లేఖ రాస్తున్నట్టు, ఆవేదన వ్యక్తం చేశారు.ఇకపోతే టీఎంసీ తరపున పోటీ చేసి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సోనాలికి మమతతో ఉన్న సన్నిహిత సంబంధాలు పార్టీ మారడం వల్ల బెడిసికొట్టాయి.
అందుకే వాటిని పునరుద్దించుకునే క్రమంలో ఈ విధంగా వేడుకుంటున్నారు.అయినా పార్టీ మారే ముందే ఆలోచిస్తే ఈ బాధలు ఉండేవి కాదుకదా.!
.






