కరోనా నియంత్రణలో ఎమర్జెన్సీ టైం లో వాడిన రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లకు మంచి డిమాండ్ ఏర్పడింది.కొన్నిచోట్ల దీని అవసరాన్ని క్యాష్ చేసుకునేందుకు బ్లాక్ మార్కెట్ లో అమ్మిన వారు ఉన్నారు.
ప్రభుత్వం నుండి సరఫరా చేసిన ఈ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్ లో అమ్మ్యిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.కరోనా పేషెంట్స్ కు రెమ్‌డెసివిర్ కంపల్సరీ అన్న విధంగా ప్రచారం జరిగింది.
దానికోసం కరోనా బాధితులు చాలా ఇబ్బందులు పడ్డారు.అయితే ఇప్పుడు ఆ రెమ్‌డెసివిర్ ను కరోనా చికిత్స నుండి తప్పిస్తున్నారని తెలుస్తుంది.
ఈ ఇంజక్షన్ ప్రభావంపై డౌట్స్ రేజ్ అవుతున్నాయి.ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ మెడిసిన్ ను కోవిడ్ చికిత్స నుండి తప్పించాలనే ఆలోచనలో ఉందిఉ.సర్ గంగారాం హాస్పిటల్ చైర్మన్ డి.ఎస్ రాణా కూడా ఈ విషయాన్ని వ్యక్తపరిచారు.కరోనా బాధితులపై రెమ్‌డెసివిర్ ఎలాంటి ప్రభావం చూపిస్తున్నట్టు ఆధారాలు లేవని ఆయన అన్నారు.భారత వైద్య పరిశోధనా మండలి ఐ.సీ.ఎం.ఆర్ ప్లాస్మా చికిత్సని ప్రోటోకాల్స్ నుండి తొలగించారు.కొవిడ్ నుండి కోలుకున్న వారి నుండి సేకరించిన యాంటీ బాడీలు కరోనా రోగులపై ప్రభావం చూపిస్తాయని ముందు చెప్పారు.
కాని ప్లాస్మా థెరపీ కూడా ఎలాంటి ప్రభావం చూపించట్లేదని అందుకే దాన్ని ప్రోటోకాల్ నుండి తొలగించామని అన్నారు.ఇక ఇప్పుడు రెమ్‌డెసివిర్ ప్రభావానికి సంబందించి ఎలాంటి ఆధారాలు లేవని అందుకే కొవిడ్ కేసుల్లో దీని వాడకాన్ని నిలిపివేయడం మంచిదని ఆయన అన్నారు.