రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ మీటింగ్..!

కరోనా సెకండ్ వేవ్ లో రోజు రోజుకి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చాలా రాష్ట్రాలు ఇప్పటికే లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.

అయితే తెలంగాణా రాష్ట్రంలో మాత్రం కేవలం నైట్ కర్ఫ్యూని మాత్రమే కొనసాగిస్తున్నారు.

అయితే కేసులు అధికమవడం.కరోనా నియంత్రణ గురించి తెలంగాణా ప్రభుత్వం కూడా కేబినెట్ సమావేశం ఏర్పరుస్తున్నారు.

ఇతర రాష్ట్రాల్లో లాక్ డౌన్ వల్ల కేసులు కొద్దిగా తగ్గినట్టుగా రిపోర్ట్ వస్తుంది.అందుకే లాక్ డౌన్ పై చర్చించేందుకు సిఎం కే.సి.ఆర్ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ మంత్రులతో భేటీ కానుది.రాష్ట్రంలో కరోనా పరిస్థితి.

లాక్ డౌన్ తదితర అంశాల మీద కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.లాక్ డౌన్ విధించిన రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి.

Advertisement

తెలంగాణాలో లాక్ డౌన్ విధిస్తే ఎలా ఉంటుంది అన్న దాని మీద కేబినెట్ మీటింగ్ జరుగనుంది.దీనితో పాటుగా మంత్రివర్గ విస్తరణపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.

అయితే ఇటీవలే రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే ప్రసక్తే లేదని సిఎం కే.సి.ఆర్ అన్నారు.కాని పరిస్థితి చేయి దాటి పోతున్న కారణంగా అధికారుల సూచనల మేరౌ కొద్దిరోజులు లాక్ డౌన్ ప్రకటించే అంశంపై రేపు మీటింగ్ జరుగనుంది.

Advertisement

తాజా వార్తలు