ఈ వయసులో ఇలాంటి సినిమాలు ఏంటీ రాజు గారు?

టాలీవుడ్‌ లో ఎంతో మంది నిర్మాతలు ఉన్నారు కాని కొందరు మాత్రమే గుర్తుండి పోతారు.ఎందుకంటే వారు కథను నమ్మి సినిమా లు తీశారు.

వారి సినిమాలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.అలాంటి నిర్మాతల్లో ఒకరు ఎం ఎస్ రాజు.

ఈయన నిర్మాణం లో వచ్చిన పలు సినిమా లు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి.రికార్డు బ్రేకింగ్ వసూళ్లను సైతం దక్కించుకున్న సినిమా లను ఈయన నిర్మించిన విషయం తెల్సిందే.

అందుకే ఎం ఎస్ రాజు అంటే అందరికి గౌరవం.ఇండస్ట్రీ లో పలువురు హీరోలకు హిట్ లను అందించిన ఈయన కాల క్రమేనా నిర్మాతగా నిరాశ పర్చుతూ వచ్చాడు.

Advertisement

మెల్లగా నిర్మాణంకు దూరం అయ్యాడు.ఈయన సినిమా నిర్మాణం కు దూరం అయ్యి దర్శకత్వం వైపు అడుగులు వేశాడు.

అప్పటి నుండి కూడా ఈయన వరుసగా సినిమా లు చేస్తూ వస్తున్నాడు.ఇటీవల ఈయన డర్టీ హరి అనే సినిమాను చేశాడు.

ఆ సినిమా మరీ బూతు సినిమా మాదిరిగా ఉంది.అక్రమ సంబంధాలు అసభ్య కార్యక్రమాల నేపథ్యంలో ఆ సినిమా ఉంటుంది.

ఏమాత్రం ఆకట్టుకోని విధంగా ఉండే ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కాకుండా ఓటీటీ ద్వారా విడుదల అయ్యింది.ముసలోడు అయిన ఈ వయసు లో డర్టీ సినిమాలు ఏంటీ రాజు గారు అంటూ కొందరు ఆయన్ను విమర్శించారు.అయినా కూడా తన ఆలోచన మార్చుకోలేదు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

డర్టీ హరి తర్వాత ఈ రాజు గారు 7 డేస్‌ 6 నైట్స్‌ సినిమా ను చేస్తున్నట్లుగా ప్రకటించాడు.టైటిల్‌ ను చూస్తుంటేనే ఇదేదో కాస్త అటు ఇటు గా బూతు సినిమా మాదిరిగానే ఉంటుందేమో అనిపిస్తుంది.

Advertisement

రాజు గారు మళ్లీ మళ్లీ విమర్శలు పడేందుకు ఇలాంటి సినిమా లు తీయడం చేయడం అవసరమా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. బర్త్‌ డే సందర్బంగా ఎం ఎస్ రాజు ఈ సినిమా ను అనౌన్స్ చేశాడు.

తాజా వార్తలు