న్యూస్ రౌండప్ టాప్ 20 

1.కేరళ లో లాక్ డౌన్

మే 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు కేరళ లో సంపూర్ణ లాక్ డౌన్  విధిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది.

2.కుక్క ను అరెస్ట్ చేసిన పోలీసులు

మధ్యప్రదేశ్ లో లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో ఇండోర్ లోని పలసియా ప్రాంతంలో ఓ వ్యాపార వేత్తను కుక్కను తీసుకొని రోడ్డుపైకి రావడంతో పోలీసులు అతడిని అతడి తో పాటు ఆయనకు కుక్కను స్టేషన్ కు  తరలించారు.ఈ వ్యవహారం అక్కడ సంచలనంగా మారింది.

3.తమిళ్ సూపర్ హిట్ చిత్రాన్ని రీమేక్ చేయనున్న సునీల్

తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు టైటిల్ రోల్లో నటించిన మండేలా సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.ఇందులో టైటిల్ రోల్ ను సునీల్ పోషించనున్నారు.

4.కేంద్రమంత్రి మురళీధరన్ కారుపై దాడి

కేంద్రమంత్రి మురళీధరన్ కారుపై దాడి జరిగింది.పశ్చిమ బెంగాల్ లోని వెస్ట్ మిడ్నాపూర్ పంచ్ క్కుడి లో ఈ ఘటన చోటు చేసుకుంది.

5.కరోనా తో కమెడియన్ మృతి

ప్రముఖ తమిళ కమెడియన్ పాండు (74) కరోనాతో కన్నుమూసారు.

6.31 వరకు ఓయూ కి వేసవి సెలవులు

ఉస్మానియా యూనివర్సిటీ కి ఈ నెల 31 వరకు వేసవి సెలవులు ప్రకటించినట్ల ఆ వర్సిటీ రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డి ప్రకటించారు.

7.తెలంగాణలో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 6,026 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

8.కోలుకుంటున్న సింహాలు

హైదరాబాద్ నెహ్రు జూ పార్క్ లో కరోనా బారిన పడిన సింహాలు కోలుకుంటున్నట్లు జూ అధికారులు తెలిపారు.

9.ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన కేటీఆర్

Advertisement

కరుణ బారినపడి కొద్దిరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి కేటీఆర్ బుధవారం రాత్రి డిశ్చార్జ్ అయ్యారు.

10.అనాధ పిల్లల కోసం ప్రత్యేక  హెల్ప్ లైన్

కువైట్ బారిన పడిన అనాధ లేదా అత్యవసర మైనటువంటి పిల్లల కోసం ప్రత్యేక helpline ను ప్రారంభించినట్లు ఆదిలాబాద్ జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.ఈ హెల్ప్ లైన్ నంబర్ 04023733665.

11.రేపు కాంగ్రెస్ ఎంపీలతో సోనియా గాంధీ సమావేశం

కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ రేపు తమ పార్టీ లోక్ సభ సభ్యుల తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు.

12.ఏనుగుల దాడి లో మహిళ మృతి

విజయనగరం జిల్లాలో ఏనుగుల బీభత్సం సృష్టించాయి కొమరాడ మండలం పాతకల్లికోట గ్రామం సమీపాన పొలం లోని ఏనుగుల దాడిలో అల్లాడ అప్పమ్మ అనే మహిళ మృతి చెందింది.

13.నేడు స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మె వాయిదా

విశాఖలో నేటి నుంచి జరగాల్సిన స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మె వాయిదా పడింది.

14.నేటి నుంచి బ్యాంకుల పనివేళల్లో మార్పు

కరోనా కారణంగా నేటి నుంచి బ్యాంకుల పనివేళల్లో మార్పు చేశారు.ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి.

15.మీడియా పై ఈసీ పిటిషన్

మీడియాను నియంత్రించాలని కేంద్ర ఎన్నికల సంఘం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

16.ఏపీలో కరోనా నియంత్రణ పై సుప్రీంకోర్టు అసంతృప్తి

కరోనా నియంత్రణకు ఏపీలో సరైన చర్యలు తీసుకోవడం లేదని హై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

17 భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 4,12,262 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

18.జంతువుల ద్వారా కరోనా సోకదు

కరోనా వైరస్ మనుషుల నుంచి మనుషులకే తప్ప జంతువుల ద్వారా సోకదని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు.

19.టీకా పేటెంట్ పై భారత్ కు అమెరికా మద్దతు

కోవిడ్ టీకా పేటెంట్ మినహాయింపు పై చేస్తున్న పోరాటానికి అమెరికా మద్దతు తెలిపింది.

20.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 44,000 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 48,000.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు