జానా సంచలన నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే

దేశంలో అత్యంత గొప్ప అనుభవం, చరిత్ర కలిగిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ అని ఏ మాత్రం సందేహం లేకుండా చెప్పవచ్చు.

అయితే అటువంటి గొప్ప చరిత్ర కలిగిన పార్టీ మనుగడ ఇప్పుడుదేశ వ్యాప్తంగా ప్రశ్నార్థకంగా మారింది.

అయితే ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే తెలంగాణను ఇచ్చిన పార్టీగా ప్రజల్లో పేరును నిలుపుకోలేకపోయింది.అయితే తెలంగాణను ఇచ్చిన నాటి నుండి జరిగిన ఎన్నికల నుండి మొదలు కొని ఆ తరువాత జరిగిన ఏ ఎన్నికలోనూ సత్తా చాటకపోవడంతో ప్రజల్లో పలుచన అయ్యారని చెప్పవచ్చు.

అంతే కాక నాయకుల మధ్య ఆధిపత్య పోరు కాంగ్రెస్ మరింత కృంగదీసిందని చెప్పవచ్చు.అయితే తాజాగా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే.

ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి పై గెలుపొందారు.అయితే ఓటమి అనంతరం నిర్వహించిన సమావేశంలో జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.

Advertisement

ఇక ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయాలని ఆసక్తి లేదని, కావున ఇక ఎన్నికలలో పోటీ చేయబోనని తెలిపారు.అయితే దీనికి వయస్సు ఒక కారణమని జానారెడ్డి చెప్పినా ఈ సంచలన నిర్ణయం వెనుక బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది.

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారం సమయంలో కాంగ్రెస్ నాయకులు సరిగ్గా ప్రచారం చేయడంలో విఫలమయ్యారని, కాంగ్రెస్ ఆధిపత్య పోరు కారణంగానే, ప్రజల్లో కాంగ్రెస్ వెళ్లలేదని, ఇక ఇప్పట్లో కాంగ్రెస్ పరిస్థితి మారేలా కనిపించడం లేదని జానారెడ్డి భావించినట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు