సైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప.ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.అల్లు అర్జున్ మొదటిసారిగా పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.
ఈ మధ్యనే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప నుండి విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.ఈ టీజర్ లో అల్లు అర్జున్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారనే చెప్పవచ్చు.
సరైన సినిమాతోనే అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవల్లో ఎంట్రీ ఇస్తున్నాడని ఈ టీజర్ చుసిన తర్వాత అందరూ అభిప్రాయ పడుతున్నారు.ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.
ఇందులో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు.రష్మిక మందన్న ఒక గిరిజన యువతిగా నటిస్తుంది.
మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.

అయితే ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది.ఇప్పుడు ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఈ సినిమా స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
ఈ సినిమా మణిరత్నం తెరకెక్కించిన విలన్ సినిమాకు కాపీగా తెరకెక్కుతోందని ఆ సినిమా స్టోరీ లైన్ ను బేస్ చేసుకుని సుకుమార్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
ఈ సినిమాలో చెల్లిని చంపినా విలన్ ను హీరో ఎలా అంతమొందించాడనే కాన్సెప్ట్ తో మణిరత్నం తెరకెక్కించాడు.
పుష్ప సినిమాలో కూడా పుష్పరాజ్ చెల్లెలు చనిపోవడంతో పుష్పరాజ్ తన చెల్లి మరణానికి కారణమైన వ్యక్తిని ఎలా ఎదుర్కొన్నాడనేది చూపించ బోతున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి.మేకర్స్ కూడా ఈ విషయం కన్ఫర్మ్ చేసారు.
మరి ఈ సినిమా నిజంగానే విలన్ సినిమాకు కాపీ గా తెరకెక్కుతుందా అనే విషయం తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.