భారతీయులకు మాత్రం 'మేక్ ఇన్ ఇండియా' వాడమంటాడు.. కాకపోతే చివరికి మన ప్రధానే..?!

కరోనా కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.

లాక్ డౌన్ సమయంలో ప్రధాని మోడీ లోకల్ ఉత్పత్తుల వాడకాన్ని పెంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అంతేకాదు, లోకల్ గా ఉత్పత్తలను తయారు చేసేందుకు సూక్ష్మ, చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు ఊతం ఇచ్చేలా అనేక రాయితీలు, ఉత్పత్తులను తయారు చేసేందుకు రుణాలు మంజూరు చేస్తున్నారు.ఇండియాలో తయారయ్యే వస్తువులను మాత్రమే అమ్మేలా చట్టాన్ని తీసుకొచ్చారు.

ఇండియాలో తయారయ్యే వస్తువులు, కొంత మేర ముడి సరుకు దిగుమతి చేసుకొని వాటితో తయారు చేసే వస్తువులు, పూర్తి స్థాయిలో ముడిసరుకును దిగుమతి చేసుకొని వాటిని ఇండియాలో తయారు చేసే వస్తువులుగా డివైడ్ చేశారు.పూర్తిగా ముడిసరుకును దిగుమతి చేసుకొని ఇండియాలో తయారు చేసే వస్తువులపై పూర్తిగా బ్యాన్ చేశారు.

పూర్తిగా ఇండియాలో తయారయ్యే వస్తువులు, కొన్ని రకాల ముడి పదార్ధాలు దిగుమతి చేసుకొని వాటితో వస్తువులను తయారు చేసుకోవడం వంటి వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు.ఈ క్రమంలో దాదాపుగా వెయ్యికి పైగా వస్తువులను కేంద్ర హోమ్ శాఖ బ్యాన్ చేసింది.

Advertisement

ఇందులో డాబర్, నెస్లే, బ్లూ స్టార్, కోల్గేట్, విఐపి ఇండస్ట్రీస్, యురేకా ఫోర్బ్స్ వంటి ఉత్పత్తులను కేంద్ర హోంశాఖ బ్యాన్ చేసింది.మేకిన్ ఇండియా ఉద్యమంతో మోడీ ఒక సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

అయితే ఆయన మాత్రం పప్పులో కాలేసి దొరికిపోయారు. మోడీ మహాత్మా గాంధీ స్వదేశీ వస్తు విధానాన్ని తెరమీదికి తెచ్చి మార్కులు కొట్టేశారు.

దేశంలోని 130 కోట్ల మంది ప్రజలకు నీతి వాక్యాలు చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ తాను మాత్రం మేకిన్ ఇండియా వస్తువులను వినియోగించడం లేదు.

తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ ఓ కారులో అంచుపై నిలబడి అభివాదం చేస్తున్న ఫొటో ఒకట సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఆ కారు రేంజ్ రోవర్కంపెనీది.ఈ ఫొటోను చూసిన నెటిజన్లు ఇందుకు సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

షారుఖ్ ఖాన్ ఎందుకు సౌత్ డైరెక్టర్ల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నాడు..?
వీధి ఆవులకు రొట్టెలు పెడుతున్న మహిళ.. వీడియో చూస్తే ఫిదా..

మాకేమో స్వదేశీ మంత్రం బోధిస్తూ మీరేమో విదేశీ మంతం పఠిస్తున్నారా? మోడీజీ అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.బీజేపీ నేతలు మాత్రం దీనిని తిప్పికొడుతున్నారు.

Advertisement

రేంజ్ రోవర్ ఇండియా కంపెనీనే కదా! టాటా వాళ్లు కొన్నారు కదా అని మాట మారుస్తున్నారు.మొత్తానికి మోడీ మాటలు చెప్పడానికే కానీ వాటిని పాటించేందుకు మాత్రం కాదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

రానురాను దీనిపై ఏవిధమైన చర్చ జరుగుతుందో వేచిచూడాల్సిందే మరి.

తాజా వార్తలు