పులిపిర్లు ఇబ్బంది పెడుతున్నాయా..అయితే ఈ టిప్స్ మీకే!

స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మందిని వేధించే పులిపిరి కాయ‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ఈ పులిపిర్లు ఎక్కువ‌గా ముఖం, మెడ‌, పాదాల‌పై ఏర్ప‌డుతుంటాయి.

హ్యూమన్ పాపిలోమా అనే వైరస్ వ‌ల్ల ఈ పులిపిరి కాయ‌లు వ‌స్తాయి.పాదాల‌పై పులిపిర్లు వ‌స్తే పెద్ద‌గా స‌మ‌స్య ఉండ‌దు.

కానీముఖం, మెడ‌పై వ‌స్తేనే కాస్త అసహ్యంగా మ‌రియు అసౌక‌ర్యంగా ఉంటుంది.దీంతో ఈ పులిపిరి కాయ‌ల‌ను త‌గ్గించుకునేందుకు నానా తిప్పలు ప‌డుతుంటారు.

అయితే ఇంట్లోనే కొన్ని కొన్ని చిట్కాలు పాటిస్తే సులువుగా ఈ స‌మ‌స్య‌ను నివారించుకోవ‌చ్చు.మ‌రి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

పులిపిర్ల‌కు చెక్ పెట్ట‌డంలో అరటి పండు తొక్క గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.చిన్న‌అర‌టి పండు తొక్క తీసుకుని.

రాత్రి నిద్రించే ముందు పులి పిరి ఉన్న చోట పెట్టి బ్యాండేజ్ వేయాలి.ఇలా ప్ర‌తి రోజు చేస్తే క్ర‌మంగా పులిపిర్లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

అలాగే పులిపిర్ల‌ను సహజ సిద్ధంగా నివారించ‌డంలో యాపిల్ సిడర్ వెనిగర్ కూడా అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.యాపిల్ సిడర్ వెనిగర్ లో దూదుని ముంచి పులిపిర్లు ఉన్న చోట అప్లై చేయాలి.ఇలా రోజుకు ఒక‌టి లేదా రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల పులి పిర్లు ఫాస్ట్ గా త‌గ్గిపోతాయి.

ఇక బేకింగ్ పౌడ‌ర్‌తో కూడా పులి పిరి కాయ‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు.అందుకు ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా బేకింగ్ పౌడ‌ర్ మ‌రియు ఆముదం వేసి బాగా మిక్స్ చేయండి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

రాత్రి నిద్రంచే ముందు పులి పిర్లు ఉన్న చోట ఈ మిశ్ర‌మాన్ని అప్లై చేసి.ఉద‌యాన్ని గోరు వెచ్చ‌ని నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తూ ఉంటే.

Advertisement

పులిపిర్లు స‌మ‌స్య దూరం అవుతుంది.

తాజా వార్తలు