అపరిచితుడు సినిమాతో శంకర్ ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే.ఈ సినిమాలో విక్రమ్ రెమో, రామానుజం, అపరిచితుడిగా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటించి ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందించారు.
అయితే తాజాగా శంకర్ అపరిచితుడు హిందీ రీమేక్ చేస్తున్నట్టు ప్రకటించాడు.ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ తో వివాదం జరుగుతుంది.
ఈ సినిమాలో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తున్నట్టు ప్రకటన కూడా ఇచ్చారు.అయితే ఈ ప్రకటన ఇచ్చిన కొద్దీ గంటల్లో నే ఈ సినిమా నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ శంకర్ పేరు మీద లీగల్ నోటీసులు జారీ చేసాడు.
ఈ సినిమా విషయంలో అన్ని రైట్స్ నిర్మాతగా తనకు మాత్రమే ఉన్నాయని దర్శకుడు నాకు తెలపకుండా ఎలా వాడుకుంటాడు అని ఆయన వాదిస్తున్నాడు.

అయితే ఈ వివాదం జరుగుతుండగానే తనకేమి పట్టనట్టు గా శంకర్ ముందుకు సాగిపోతున్నాడు.దర్శక నిర్మాతలు మధ్య వివాదం అంతం అవకుండానే శంకర్ ఈ సినిమా నటీనటు లను ఎంపిక చేసే పనిలో పడ్డాడు.ఈ సినిమా కోసం హీరోయిన్ ను కూడా సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.
ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ కు జోడీగా కియారా అద్వానీ ని తీసుకున్నట్టు సమాచారం.
ఇప్పటికే కియారా అద్వానీ ఈ సినిమాకు సైన్ కూడా చేసినట్టు టాక్ వినిపిస్తుంది.
అయితే ఈ వివాదం నుండి శంకర్ ఎలా బయటపడి ఈ సినిమాను రీమేక్ చేస్తాడో వేచి చూడాల్సిందే.అయితే ప్రస్తుతం శంకర్ కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే రామ్ చరణ్ తో ఒక భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేసాడు.