ప్రధాని మోడీ కి లెటర్ రాసిన సీఎం జగన్..!!

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఊహించని విధంగా పెరిగిపోవటం అందరిని టెన్షన్ పెట్టిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఈ విషయంలో ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కావడం జరిగింది.

ఈ క్రమంలో కరోనా టీకా కార్యక్రమం శరవేగంగా జరిపేలా వ్యాక్సినేషన్ సెంటర్లు భారీగా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.అంతేకాకుండా కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.

పరిస్థితి ఇలా ఉండగా తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోడీ కి లెటర్ రాయడం జరిగింది.టీకా ఉత్సవ్ కోసం 25లక్షల వ్యాక్సిన్ డోస్ లు పంపాలని మోడీ కి విజ్ఞప్తి చేశారు.

కేంద్రం సూచనల మేరకు రాష్ట్రంలో కరోనా వైద్య పరీక్షలు పెద్ద ఎత్తున జరుపుతున్నామని స్పష్టం చేశారు.రాష్ట్రంలో ఏ లోటూ లేకుండా వ్యాక్సినేషన్ అమలు చేస్తున్నాం.

Advertisement

టీకా ఉత్సవ్ ప్రతి గ్రామంలో ప్రతి వార్డు లో భారీ స్థాయిలో జరిగేలా రోజుకి ఆరు లక్షల మందికి వ్యాక్సిన్ అందించేలా ఏర్పాట్లు   చేశామని మోడీకి ఏపీ సీఎం జగన్ లెటర్లో స్పష్టం చేశారు.ఈ క్రమంలో ఈ నెల 11వ తేదీ నాటికి 25 లక్షల డోసులు పంపించాలని పేర్కొన్నారు.

అంతేకాకుండా ఇందుకు సంబంధించి.

Advertisement

తాజా వార్తలు