ఆ వంద నోటును ఇప్పటికీ దాచుకున్న అల్లు అర్జున్..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్, క్లాస్ అనే తేడాల్లేకుండా అన్ని పాత్రల్లో నటిస్తూ స్టైలిష్ స్టార్ గా గుర్తింపును సంపాదించుకున్నారు అల్లు అర్జున్.

హీరోగా నటించిన ప్రతి సినిమాలో వైవిధ్యం ఉండే విధంగా అల్లు అర్జున్ జాగ్రత్త పడ్డారు.

బాలనటుడిగా విజేత, స్వాతిముత్యం సినిమాల్లో నటించిన అల్లు అర్జున్ చిరంజీవి నటించిన డాడీ మూవీలో గెస్ట్ రోల్ లో చేశారు.చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్ కు డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం.

చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో బన్నీ డ్యాన్స్ చేయగా బన్నీ డ్యాన్స్ ను చూసిన రాఘవేంద్ర రావు వంద రూపాయల నోటు అడ్వాన్స్ గా ఇవ్వడంతో పాటు అల్లు అర్జున్ ను తానే పరిచయం చేస్తానని అల్లు అర్జున్ తల్లికి చెప్పారు.అలా చెప్పిన కొన్ని సంవత్సరాల తర్వాత రాఘవేంద్రరావు డైరెక్షన్ లో గంగోత్రి సినిమాతో బన్నీ టాలీవుడ్ కు పరిచయమయ్యారు.

ఆ సినిమా నటుడిగా అల్లు అర్జున్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది.

Advertisement

రాఘవేంద్రరావు అడ్వాన్స్ గా ఇచ్చిన ఆ వంద నోటును బన్నీ ఇప్పటికీ దాచుకున్నారని సమాచారం.గంగోత్రి తరువాత ఆర్య, బన్నీ సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు.దేశముదురు సినిమాతో సిక్స్ ప్యాక్ చేసి బన్నీ యూత్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు.

బన్నీని ఆయన అభిమానులు ప్రేమగా స్టైలిష్ స్టార్ అని పిలుచుకునే వారు.అయితే బన్నీ తన తాజా సినిమాకు ఐకాన్ స్టార్ గా పేరును మార్చుకున్నారు.భవిష్యత్ ప్రాజెక్ట్ లను మరింత జాగ్రత్తగా ఎంచుకుంటున్న అల్లు అర్జున్ భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంటానని భావిస్తున్నారు.

నిన్న విడుదలైన పుష్ప టీజర్ యూట్యూబ్ లో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.ఆగష్టు 13వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు