తెలంగాణలో టీడీపీ కనుమరుగు ? ఏపీలోనూ ఆ ఎఫెక్ట్ ? 

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కోలుకోలేని విధంగా ఎప్పటి నుంచో వరుస దెబ్బలు తింటూ వస్తోంది.ఇప్పటికే ఆ పార్టీ కార్యక్రమాలు అంతంతమాత్రంగా ఉంటూ వస్తున్నాయి.

ఏ ఎన్నికల్లోనూ పెద్దగా ప్రభావం చూపించలేక పోతుంది.2014 అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మొత్తం రెండు స్థానాలు మాత్రమే గెలుచుకో గలిగింది.సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య,  నరసరావుపేట నుంచి మెచ్చ నాగేశ్వరావు ఇద్దరు మాత్రమే గెలిచారు.

ఇక ఆ తర్వాత ఎన్నికల్లో టీడీపీ ప్రభావం కనిపించలేదు.ఎమ్మెల్యేలను చేయించుకునేందుకు మొదట్లో టిఆర్ఎస్ పార్టీ గట్టిగానే ప్రయత్నాలు చేసినా, ఎవరు అటు వైపు వెళ్లేందుకు ఇష్టపడలేదు.

అయితే ఆ తరువాత సండ్ర వీరయ్య టిఆర్ఎస్ అనుబంధంగా కొనసాగుతుండగా, నాగేశ్వరావు తాను టిడిపి లోనే ఉంటాను అంటూ ప్రకటనలు చేసేవారు.తాజాగా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు.

సీఎం కేసీఆర్ తో సమావేశమైన తర్వాత నాగేశ్వరావు టిఆర్ఎస్ లో చేరారు.ఆ తరువాత ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తో కలిసి నాగేశ్వరావు టీడీపీ శాసన సభ పక్షాన్ని టిఆర్ఎస్ లో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

దీంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మనుగడ ప్రశ్నార్ధకం లో పడింది.ఇక పూర్తిగా టీడీపీ ఇక్కడ ఆశలు వదిలేసుకున్నట్టే అయ్యింది.

చంద్రబాబుకు వీర విధేయులైన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వెళ్లేముందు బాబు అనుమతి తీసుకున్నారు అనే ప్రచారం జరుగుతోంది.ఇప్పుడు ఏపీ టిడిపి పైన ఆ ప్రభావం కనిపిస్తోంది.ఎందుకంటే ఏపీలోనూ ఇప్పుడు టిడిపి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

పార్టీ సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నా, ఎవరి వల్ల పార్టీకి ఉపయోగం లేదు అన్నట్లుగా పరిస్థితి ఉంది.యువ నాయకులు పెద్దగా లేకపోవడం, టిడిపి అన్ని విషయాల లోనూ వెనకబడటం,  ఇలా ఎన్నో కారణాలతో చాలాకాలంగా టీడీపీ ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తోంది.2019 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 23 స్థానాలే ఆ పార్టీ కి దక్కాయి.అందులోనూ కొంతమంది ఎమ్మెల్యేలు టీడీపీకి దూరమయ్యారు.

ఇక ఎప్పుడూ లేని విధంగా ఏపీలో పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు టీడీపీ పొలిట్ బ్యూరో లో నిర్ణయం తీసుకోవడం పెద్ద దుమారాన్ని రేపింది.టీడీపీ పని ఏపీలోనూ అయిపోయిందని , తెలంగాణలో దుకాణం ముసేసినట్టే ఏపీలోనూ ఆ పరిస్థితికి పార్టీని తీసుకువస్తున్నారని తెలుగు తమ్ముళ్ల అధినేత తీరుపై ఫైర్ అవుతున్నారట.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు