షర్మిలకు అతనిలా రాజకీయం చేయాలని కీలక సూచనలు

తెలంగాణ రాజకీయాల్లో రాకెట్ లా దూసుకొచ్చిన నాయకురాలు ఆంధ్రా ఆడబిడ్డ షర్మిల ఏప్రిల్ 9న రాజకీయ పార్టీని ప్రకటించనున్న విషయం తెలిసిందే.

అయితే షర్మిల రాజకీయ విధానం పట్ల పార్టీలో నూతనంగా చేరిన నాయకులు రకరకాల సలహాలు ఇస్తున్నారట.

పార్టీ ఏర్పాటు నిర్ణయం తరువాత నుండి నాయకులతో నిర్వహించనున్న సమావేశలపైనే ఫోకస్ పెట్టిన షర్మిల తన రాజకీయ వ్యవహార శైలిపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు.అయితే నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేస్తే నాయకులతో సఖ్యత ఏర్పడుతుంది తప్ప ప్రజలతో సత్సంబంధాలు మెరుగుపడవని షర్మిలకు పలువురు నేతలు సూచిస్తున్నారని సమాచారం.

అయితే తెలంగాణలో ప్రస్తుతం మారుమోగుతున్న తీన్మార్ మల్లన్న తరహాలో రాజకీయం ఉంటే ప్రజల్లోకి తొందరగా ముద్ర ఏర్పాటు చేయవచ్చని అనుకుంటున్నారట.ఇవన్నీ వదిలేసి ఇప్పుడే 2023 లో తమదే అధికారం అని ప్రగల్బాలకు పోతే చాలా గడ్డు పరిస్థితులు ఎదురవున్నాయి.

అయితే ఈ సలహాలను షర్మిల తీసుకొని తన రాజకీయ పంథా మార్చుకుంటుందా లేక తాను మొదటి నుండి అనుకుంటున్న రాజకీయ వ్యూహంతోనే ముందుకెళ్తుందా లేదా చూడాలంటే పార్టీ ఏర్పాటు సభ, రోజూ రాజకీయాలపై స్పందించే విధానంతో షర్మిల రాజకీయ వ్యూహం అనేది బయటపడుతుంది.ఏది ఏమైనా తెలంగాణ రాజకీయాల్లో షర్మిల హాట్ టాపిక్ గా మారనుంది.

Advertisement
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

తాజా వార్తలు