టీనేజర్ల కోసం కొత్త ఫీచర్ తీసుకొచ్చిన ఇంస్టాగ్రామ్..!

ఇన్‏స్టాగ్రామ్.తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ తీసుకువస్తూ.అందుబాటులో ఉంటుంది.

ఇటీవల ఇన్స్టాలో ఆకర్షణీయమైన ఫీచర్స్ అందించింది.తాజాగా మరో ఫీచర్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

గత కొంత కాలంగా వాట్సప్ ప్రైవసీ నిబంధనలు నేపథ్యంలో.యూజర్ ప్రైవసీలో మరో ముందడుగు వేసింది ఇన్ స్టా.

ఇందులో భాగంగా.ఇన్ స్టాలో ఉండే మైనర్ల ఖాతాలకు మరింత రక్షణ, ప్రైవసీ కల్పించనున్నట్లు ఇన్ స్టా వెల్లడింది.18 సంవత్సరాల వయసున్న వారికి అడల్ట్ మేసేజ్‏లు వెళ్ళకుండా ఉండేందుకు ఈ ఫీచర్ తీసుకువచ్చినట్లు పేర్కోంది.దీనివల్ల వారి ఖాతాలకు అసభ్యకరంగా సందేశాలు పంపి.

Advertisement

వేధించే అవకాశాలను నివారించవచ్చు.దీంత మైనర్లు తమకు తెలియని వ్యక్తుల నుంచి అడల్ట్ మేసేజ్ లేదా ఏదైనా సందేషం వచ్చినా.

ముందుగానే ఓ వార్నింగ్ మెసేజ్ వస్తుందని.దాంతో.

ఎవరితో ఛాటింగ్‌ చేస్తున్నామనేది మైనర్లు చెక్‌ చేసుకునేలా ఆ ఫీచర్‌ రూపొందించారు.త్వరలో ఈ ఫీచర్‌ అందరికీ అందుబాటులోకి వస్తుంది.

ఇక ఇటీవల కొన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్‏లో ఖాతా ఓపెన్ చేస్తున్నప్పుడు వయసు వివరాలు కోరుతుందన్న విషయం తెలిసిందే.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఇక కొంత మంది యువత.సోషల్ మీడియాలో వారికి సంబంధించిన తప్పుడు సమాచారం నమోదు చేసి.అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు.

Advertisement

ఫేక్ అకౌంట్స్ ను ఆరికట్టేందుకు ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​, మెషిన్​ లెర్నింగ్​ టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని ఇన్స్టా వెల్లడించింది.ప్రపంచ వ్యాప్తంగా నెలకు ఇన్స్టాకు 1 బిలియన్ పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారు.

ఇక గతంలో ఫేస్ బుక్ మేసేంజర్ కూడా 6 నుంచి 12 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లల కోసం మేసేంజర్ కిడ్స్ అనే ఫ్లాట్ ఫాంను ప్రారంభించింది.దీనికి విశేషస్పందన లభించింది.

ఇక వాట్సప్ ప్రైవసీ నిబంధనలపై ఆందోళనలు వస్తున్న నేపథ్యంలో ఇన్ స్టా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు