చిన్న పిల్లలతో అలా ఆడిస్తున్న ఓంకార్.. దారుణమైన విమర్శలు!

ప్రముఖ బుల్లి తెర యాంకర్ ఓంకార్ గురించి అందరికీ తెలిసిందే.

ఆయన యాంకర్ గానే కాకుండా డైరెక్టర్ గా, యాక్టర్ గా సినీ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నాడు.

ఇప్పటివరకు ఎన్నో షోలలో యాంకరింగ్ చేస్తూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు.అంతే కాకుండా ఆయన షోలు కూడా బాగా ఆసక్తి గా ఉండడంతో పాటు.

కంటెస్టెంట్ లతో బాగా ఆడిస్తాడు.అంతేకాకుండా ప్రతి ఒక్కరితో తొందరగా కనెక్ట్ అవుతూ.

ఓంకార్ అన్నయ్య గా ఫేమస్ అయ్యాడు.ఇదిలా ఉంటే తాజాగా స్టార్ మా లో రియాలిటీ డాన్స్ ప్లస్ షో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

ఇందులో ఓంకార్ యాంకర్ గా చేస్తున్నాడు.అంతేకాకుండా ఇందులో రఘు మాస్టర్, యశ్ మాస్టర్, బాబా భాస్కర్, ముమైత్ ఖాన్, మోనాల్ గజ్జర్, ఆనీ మాస్టర్ లు జడ్జ్ లుగా చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ షోలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఓంకార్ ప్రతి ఒక్కరితో డాన్స్ చేపిస్తూ బాగా ఆకట్టుకునేలా చేస్తున్నాడు.తాజాగా చిన్న పిల్లలతో అలా డాన్స్ చేయించినందుకు దారుణమైన విమర్శలు ఎదుర్కొన్నాడు ఓంకార్.

ఈ వారం డాన్స్ ప్లస్ ప్రోమో విడుదల కాగా చిన్న పిల్లలతో ఓ ఐటెం సాంగ్ కు డాన్స్ లు చేయించారు.బావలు సయ్యా.

మరదలు సయ్యా అనే పాటకు చిన్నపిల్లల డ్యాన్సులు చేశారు.దీంతో ఏంటయ్యా ఓంకార్ ఇది.చిన్న పిల్లలతో బావలు సయ్యా డాన్స్ చెపియ్యడమేంట‌ి అని విమర్శిస్తున్నారు.నీ రేటింగ్స్ కోసం చిన్నపిల్లలతో పిచ్చి పాటలకు డ్యాన్సులు చేయిస్తావా.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఆ మాత్రం కూడా చూసుకోకపోతే ఎలా అంటూ విమర్శిస్తున్నారు.కాగా ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు