2019 ఎన్నికల సమయంలో ఇండైరెక్టుగా పవన్ కళ్యాణ్ పై కామెంట్ చేసే అప్పట్లో వార్తల్లో హాట్ టాపిక్ అవ్వటం అందరికీ తెలిసిందే.ఇదిలా ఉంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో సీఎం వైఎస్ జగన్ భార్య భారతి ని ఉద్దేశించి ప్రశంసల వర్షం కురిపిస్తూ ఆశక్తికరమైన కామెంట్లు చేశారు.
ట్విట్టర్లో పూనమ్ కౌర్ ఏమి పెట్టారంటే జీవితంలో నిరాశ పడిపోయే మనుషులని సహనం ప్రేమ ఇంకా పట్టుదలతో ఆశ నింపి శాశించే స్థాయి వరకు తీస్కొని వెళ్లడం చాలా తక్కువ మంది మనుషులకి ప్రత్యేకంగా మహిళలకి సాధ్యం.అది నేను అమ్మలోసుధామూర్తి గారిలో ఇంకా వైఎస్ భారతి గారిలో చూసాను.
అంతే శక్తి నాకు దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను అని పూనమ్ కౌర్ ట్విట్టర్లో చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే పూనమ్ ఒక్కసారిగా సీఎం వైఎస్ జగన్ భార్య ని ప్రశంసిస్తూ పోస్ట్ పెట్టడం తో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జగన్ జైలుకు వెళ్లిన సమయంలో ఒక పక్క ఇంటిని మరో పక్క వ్యాపారాలను చూసుకుంటూనే పార్టీని కూడా క్రియాశీలకంగా నడిపిస్తూ అప్పట్లో వైఎస్ భారతి కీలకంగా రాణించడం జరిగింది.అటువంటిది ఆమెను ప్రశంసిస్తూ పూనం కౌర్ పెట్టిన ట్వీట్ ఏపీ రాజకీయాల్లో కూడా వైరల్ గా మారింది.