ఆ రోజు కేజీఎఫ్ 2 నుండి బిగ్గెస్ట్ అప్‌డేట్?

కన్నడలో తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.

ఈ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే గుర్తింపును తెచ్చుకున్నాడు.

ఇక ఈ సినిమాలో నటించిన హీరో యశ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా మారి అదిరిపోయే ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు.కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా కేజీఎఫ్ చాప్టర్ 2ను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.

ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌ను మాత్రమే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా ట్రైలర్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా ఈ సినిమా ట్రైలర్‌ను కూడా టీజర్ రిలీజ్ చేసిన తేదీన రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది.గతంలో మార్చి 13న 2019లో కేజీఎఫ్ చాప్టర్ చిత్ర షూటింగ్‌ను మొదలుపెడుతున్నట్లు అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, 2020 మార్చి 13న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

Advertisement

అయితే ఈ మార్చి 13న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేస్తారేమోనని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.మరి నిజంగానే మార్చి 13న కేజీఎఫ్ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ ఉండబోతుందా అనే అంశం తెలియాల్సి ఉంది.

ఇక పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో యశ్ సరసన అందాల భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.కాగా బాలీవుడ్ నటి రవీనా టండన్ ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

మరి మార్చి 13కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రం నుండి ఎలాంటి అప్‌డేట్ వస్తుందా అనేది చూడాలి.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు