మానసిక ఒత్తిడి వల్లనో లేదా చేసిన తప్పులు బయటకు వస్తే పరువు పోతుందనే భయం కారణంగానో తెలియదు గానీ ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువగా అవుతుంది.ప్రతి రంగంలోను ఇలాంటి వ్యక్తులు తారస పడుతున్నారు.
క్షణికం అయిన ఆవేశం లో ఇంకా గడపవలసిన జీవితాన్ని మధ్యలోనే తుంచేసుకుంటున్నారు.ఇలాగే బెంగాల్ నటుడు అంకకుర్ హజ్రా వద్ద పని చేసే అసిస్టెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడట.
కాగా కోల్ కతాలో నివాసం ఉంటున్న పింటూ దేవ్ (36) కు ఒక వ్యక్తి ఫోన్ చేసి తన ప్రైవేట్ వీడియోను విడుదల చేస్తానని బెదిరించడంతోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అతడి కుటుంబ సభ్యులు వెల్లడించారు.ఇక ఘటనా స్ధలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించక పోవడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిజ నిజాలు రాబట్టే క్రమంలో దర్యాప్తు చేస్తున్నారట.
ఈ క్రమం లో పింటూ దేవ్ సెల్ ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తున్నారట.