నన్ను ఆ దేవుడే కాపాడాలి : సంజన

తెలుగు నటి సంజన గల్రానీ మోడల్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని సినీ ప్రవేశం చేసింది.

అంతేకాకుండా తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు పొందింది.

బుల్లితెరలో సంజన కొన్ని సీరియల్ లో కూడా నటించింది.ఇక సోషల్ మీడియాలో కూడా తన ఫోటోల షేర్ల తో బిజీగా ఉంటుంది.2005 లో సోగ్గాడు సినిమా తో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కాగా ఆ తర్వాత ఇతర భాషల్లో వరుస సినిమాల్లో నటించింది.ఇక బుజ్జిగాడు, సత్యమేవ జయతే వంటి మరిన్ని తెలుగు సినిమాలో నటించింది.

ఇదిలా ఉంటే సంజన కొన్ని డ్రగ్స్ కేసులో కూడా అరెస్టయిన సంగతి తెలిసిందే.డ్రగ్స్ కేసులో మరో కన్నడ హీరోయిన్ రాగిని, సంజన లను గత ఏడాది సెప్టెంబర్ నెలలో బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వారిని అరెస్టు చేశారు.

ఆ తర్వాత వారిద్దరికీ బెయిల్ మంజూరు చేయడానికి కర్ణాటక హైకోర్టు మొదట తిరస్కరించగా ఆ తర్వాత ఆరోగ్య పరమైన సమస్యల గురించి ఇబ్బంది పడుతున్న సంజనను కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు.ఇక డిసెంబర్ లో ఆమె బెంగళూరులో ఉంటున్న తన ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకుంటుంది.

Advertisement

ఇదిలా ఉంటే తాజాగా నన్ను ఆ దేవుడే కాపాడాలి అంటూ పోస్ట్ చేయగా వైరల్ గా మారింది.

సంజన సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలను, మోటివేషన్ పోస్టులను షేర్ చేస్తూ అభిమానులతో దగ్గర కావడానికి పోస్ట్ చేస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో తన ఆరోగ్య పరిస్థితి బాలేదంటే కొన్ని విషయాలు తెలిపింది.ఆమె ఇప్పటికీ నిద్రలేమి సమస్యతో బాధ పడుతుందట‌.

అంతేకాకుండా తనను పీడకలలు వెంటాడుతున్నాయని ఒకట‌ి , రెండు గంటల్లోనే మేలుకువ వస్తుందని తెలిపింది.ఇక ఆమె దృఢంగా సంతోషంగా ఉండటానికి ప్రయత్నించడంలో చాలా కష్టంగా ఉందని, ఇక ఆమె మనసులో బాధ ను పబ్లిక్ వేదికలో చెప్పలేనంటూ, ఆమె అందరికీ సాయం చేశానంటూ, అంతకుమించి తను ఏ పాపం చేయలేదంటూ, దేవుడే ఉన్నాడు ఆయనకి వదిలేస్తున్నా అంటూ రాసుకొచ్చింది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు