పేరులో మార్పు చేసుకున్న అభిషేక్ బచ్చన్.. కారణమేంటంటే..?

సినిమా ఇండస్ట్రీలో హీరోగానైనా, హీరోయిన్ గానైనా వరుస విజయాలు సాధించాలంటే బ్యాక్ గ్రౌండ్, టాలెంట్ కు అదృష్టం కూడా తోడవ్వాలనే సంగతి తెలిసిందే.

అలా బ్యాక్ గ్రౌండ్, టాలెంట్ ఉన్నా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోతున్నారు అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్.

ఇన్నేళ్ల అభిషేక్ బచ్చన్ సినీ కెరీర్ లో చెప్పుకోదగ్గ భారీ సక్సెస్ లు లేకపోవడం గమనార్హం.అయితే కొంతమంది హీరోలకు పేరు మార్చుకున్న తరువాత సినిమాలు సక్సెస్ అవుతూ ఉండటంతో అభిషేక్ బచ్చన్ కూడా తన పేరులో స్వల్పంగా మార్పులు చేసుకున్నారని అభిషేక్ కు అదనంగా మరీ ను యాడ్ చేశారని తెలుస్తోంది.

ప్రముఖ న్యూమరాలజిస్ట్ లలో ఒకరైన సంజయ్ జుమాని సూచనల మేరకు అభిషేక్ పేరుతో మార్పులు చేసుకున్నట్టు తెలుస్తోంది.ఇకపై అభిషేక్ బచ్చన్ పేరు అభిషేక్ ఎ బచ్చన్ గా మారనుందని సమాచారం.

ప్రస్తుతం దస్వి అనే మూవీలో నటిస్తున్న అభిషేక్ బచ్చన్ పేరు ఈ సినిమా టైటిల్స్ అభిషేక్ ఏ బచ్చన్ అని వేయనున్నారని సమాచారం.అయితే పేరు మార్చుకున్నంత మాత్రాన అదృష్టం కలిసొస్తుందని కూడా కచ్చితంగా చెప్పలేము.

Advertisement

మరి అభిషేక్ కు దస్వి మూవీ అయినా ఆశించిన స్థాయిలో సక్సెస్ తో పాటు సాలిడ్ హిట్ ను ఇస్తుందేమో చూడాల్సి ఉంది.టాలీవుడ్ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ కూడా కొన్నేళ్ల క్రితం పేరు మార్చుకున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం సినిమాల్లో సాయిధరమ్ తేజ్ సాయి తేజ్ గా మారింది.పేరు మార్చుకున్న తరువాతే ఈ యంగ్ హీరో నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటున్నాయి.అయితే సాయిధరమ్ తేజ్ మాత్రం పేరు మార్పు వెనుక ప్రత్యేకమైన కారణం లేదని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు