క్రాక్ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ అన్ని కోట్లా..?

2021 సంవత్సరంలో తొలి పెద్ద సినిమాగా విడుదలై 50 శాతం ఆక్యుపెన్సీతో రికార్డు స్థాయిలో కలెక్షన్లను అందుకుంది క్రాక్ సినిమా.

రవితేజ, శృతిహాసన్ జంటగా నటించిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి.

ఫుల్ రన్ లో క్రాక్ సినిమా 40 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు సాధించడం గమనార్హం.ఏరియా వైజ్ గా క్రాక్ కలెక్షన్లను పరిశీలిస్తే ఈ సినిమా నైజాంలో 12.47 కోట్ల రూపాయలు సాధించింది.సీడెడ్ ఏరియాలో క్రాక్ సినిమాకు 6.24 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.ఉత్తరాంధ్రలో రూ.4.79 కోట్లు, గుంటూరులో రూ.2.81 కోట్లు, కృష్ణాలో రూ.2.38 కోట్లు, ఉభయ గోదావరి జిల్లాల్లో రూ.5.63 కోట్లు, నెల్లూరు జిల్లాలో రూ.1.79 కోట్లు, ఓవర్సీస్ లో 90 లక్షలు, ఇతర ఏరియాల్లో రూ.2.15 కోట్లు వచ్చాయి.మొత్తంగా క్రాక్ సినిమా రూ.39.16 కోట్లు కలెక్షన్లను సాధించడం గమనార్హం.రవితేజ కెరీర్ లో భారీ కలెక్షన్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా క్రాక్ నిలిచింది.

క్రాక్ సినిమా ఈ స్థాయిలో కలెక్షన్లను సాధించడంతో రవితేజ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.చాలా సంవత్సరాల తర్వాత రవితేజ నుంచి వచ్చిన ఫుల్ మీల్స్ లాంటి సినిమా క్రాక్ అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.దర్శకుడు గోపీచంద్ మలినేని క్రాక్ మూవీలో కథ, కథనం అద్భుతంగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు.

గోపీచంద్ మలినేని తరువాత సినిమా బాలకృష్ణ హీరోగా తెరకెక్కనుంది.మరోవైపు హీరో రవితేజ ప్రస్తుతం ఖిలాడీ మూవీలో నటిస్తున్నారు.

Advertisement

రమేష్ వర్మ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.ఇప్పటికే విడుదలైన ఖిలాడీ మూవీ ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మే 28వ తేదీన ఈ సినిమా విడుదల కానున్నట్టు ప్రకటన వెలువడినా రిలీజ్ డేట్ మారే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు