ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక విశేషాలు ఇవే..!

ఇండియా- ఇంగ్లాండ్ జట్లు మధ్య చివరి రెండు టెస్టులతో పాటు టీ20 సిరీస్ కూడా (సర్దార్ వల్లభాయ్ పటేల్) మొతెరా స్టేడియంలో జరగనున్నాయి.

ఫిబ్రవరి 24న భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు ప్రారంభం కానున్నది.

దీంతో ఇంగ్లాండ్ మరియు టీమిండియా క్రికెట్ ఆటగాళ్లు మొతెరా స్టేడియం ని చేరుకొని అక్కడి అందాలను, విలాసవంతమైన సదుపాయాలను చూసి ఆశ్చర్యపోతున్నారు.ఐతే ప్రపంచంలోనే అత్యంత పెద్ద స్టేడియం గా పేరొందిన మొతెరా స్టేడియం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.గుజరాత్ లోని సబర్మతీ నది ఒడ్డున 1982 లో మొతెరా స్టేడియాన్ని 49,000 సీట్ల సామర్ధ్యం తో నిర్మించారు.2015, అక్టోబర్ నెలలో ఈ స్టేడియాన్ని పునః నిర్మించి ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం గా మార్చాలని నిర్ణయించి.దాదాపు 5 ఏళ్ల కాలంలో 1,10,000 సీట్ల సామర్థ్యానికి పెంచారు.

ఇటీవలే 63 ఎకరాల్లో 4 ఎంట్రీ పాయింట్స్ తో విస్తరించి కొత్తగా నిర్మించిన మొతెరా స్టేడియంలో మైదానం సైజు 180 గజాలు X 150 గజాలు ఉంది.మొతెరా స్టేడియంలో నాలుగు జట్లకు స్టే చేయడానికి సరిపడా డ్రెస్సింగ్ రూములు ఉన్నాయి.

డ్రెస్సింగ్ రూమ్ పక్కనే జిమ్ కూడా అందుబాటులో ఉంటుంది.ఒలంపిక్ సైజు సిమ్మింగ్ పూల్ కూడా ఉంది.

Advertisement

ఈ స్టేడియంలో మూడు అవుట్ డోర్ ప్రాక్టీస్ ఫీల్డ్‌లతో పాటు ఆరు ఇండోర్ ప్రాక్టీస్ పిచ్‌లు ఉన్నాయి.ఈ స్టేడియంలోనే 40 మంది అథ్లెట్లకు వసతి కల్పించే గృహంతో పాటు ఒక ఇండోర్ క్రికెట్ అకాడమీ ఉంది.

కొత్తగా నిర్మించిన ఈ స్టేడియంలో ఫ్లడ్ లైట్స్ కి బదులు ఎల్ఈడి లైట్స్ ఉపయోగించారు.

ఇకపోతే గత నెలలో సయ్యద్ ముస్తాక్ అలీ నాక్ ఔట్ మ్యాచ్ లకు మొతెరా స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది.ఇప్పుడు తొలిసారిగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కి ఆతిథ్యం ఇవ్వబోతోంది.ఈ స్టేడియంలో 12 టెస్టులు, 23 వన్డేలు, ఒక టీ 20 మ్యాచ్ జరిగింది.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు