టాలీవుడ్ నాచురల్ స్టార్ హీరో నాని గురించి అందరికీ తెలిసిందే.నాని నటించిన సినిమాలన్నీ నిజంగానే నాచురల్ గా ఉన్నట్లు అనిపిస్తుంది.
అంతే నాచురల్ గా మంచి విజయాన్ని సాధిస్తాయి నాని సినిమాలు.మొదటగా ఆర్జెేగా పని చేసిన నాని.
సినిమాలపై ఆసక్తితో దర్శకుడిగా కావాలని అడుగు పెట్టాడట.కానీ అసిస్టెంట్ దర్శకుడిగా కాకుండా, క్లాప్ అసిస్టెంట్ గా తన కెరీర్ ను ప్రారంభించాడు.
మొదటిసారిగా వెండితెరపై అష్టా చమ్మా సినిమాలో హీరోగా పరిచయమయ్యాడు.ఇక ఆ సినిమాతో మంచి విజయాన్ని సాధించుకున్నా నానికి వరుస ఆఫర్లు రాగా.మొత్తానికి నాచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు.ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు సందర్భంగా.
ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ షో సెలబ్రేట్ గా ఆహ్వానించనుంది.ఈ విధంగా ఢీ షో లో పలు టీమ్ లు నాని జీవితాన్ని గురించి పాటల రూపంలో పైగా నాని పాటలతో చేయనున్నారు.
అంతేకాకుండా నాని మాట్లాడిన మాటలను కూడా మధ్యలో వాడనున్నారు.

ఆ మధ్య మిడిల్ క్లాస్ అబ్బాయిలు సినిమా ఈవెంట్ లో నాని మాట్లాడిన మాటలను కూడా అందులో దింపేశారు.ఇదిలా ఉంటే నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.శివ నిర్వణ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా టక్ జగదీష్.
ఈ సినిమాలో నాని హీరోగా, రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తున్నారు.ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఈ సినిమాలో ఓ పాట విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమా తర్వాత శ్యామ్ సింఘరాయ్.
ఆపై అంటే సుందరానికి అనే సినిమాను పూర్తి చేయనున్నాడు.మొత్తానికి హీరో నాని టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.







