టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నాలుగు రోజుల క్రితం ఏపీలో వాలంటీర్లు వేతనాలు పెంచాలంటూ చేస్తున్న ధర్నాలు, ఆందోళనలన విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇక మా నాయకుడు జగన్ గారు ఉక్కు మనిషి అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అంటున్నారని, మరి ఆ ఉక్కు మనిషి ఉక్కు పరిశ్రమ పోతుంటే చేతులు కట్టుకుని చూస్తు ఉన్నారంటూ చురకలంటించారు.
ఇక ప్రేమికుల రోజు సందర్భంగా వైసీపీ నాయకులు కేంద్రం పై ప్రత్యేక హోదా గురించి పోరాడకుండా ఎప్పటి లాగే ప్రేమ ఒలకబోస్తూ సమయాన్ని వృధా చేస్తున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడిస్తున్నారు.
ఇకపోతే కేంద్రం పై ప్రేమ ఉంటే సొంత డబ్బులు పెట్టి గిఫ్ట్స్ కొని ఇవ్వాలని, ఇలా వాలెంటైన్స్ డే బహుమతి గా స్టీల్ ప్లాంట్ ని ఇవ్వాలని చూడకుండా మరో మార్గం వెతుక్కుంటే మంచిదని అని గోరంట్ల ఎద్దేవా చేశారు.