తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ సరసన నువ్వు నేను సినిమా లో నటించిన అనిత హసానందని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది.2001లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేయడంతో పాటు అనితకు తగిన గుర్తింపును సొంతం చేసుకుంది ఈ భామ .
ఆ తర్వాత అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్ హీరోల సరసన సినిమాలలో చేసింది.నువ్వు నేను సినిమా అనంతరం వరుసగా సినిమాలలో నడిచిన కూడా అనితకు అనుకున్నంత గుర్తింపు రాలేదు .2013లో ప్రముఖ పారిశ్రామికవేత్త రోహిత్ రెడ్డి ని ప్రేమించి వివాహం చేసుకుంది .అనిత వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన ఏడు సంవత్సరాల తర్వాత ఆమె తొలి సంతానానికి జన్మ ఇచ్చింది.అనిత పండంటి అబ్బాయికి జన్మనిచ్చింది.రోహిత్ రెడ్డి, అనిత వారసుడు ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేయక అవి కాస్త వైరల్ గా చక్కర్లు కొడుతుంది .ఈ పోస్టు చూసిన బాలీవుడ్ సెలబ్రెటీలు సమీరా రెడ్డి, ఏక్తా కపూర్, నకుల్ మెహతా, కరణ్ వీర్ తదితరులు వారికీ శుభాకాంక్షలు తెలియజేశారు .
అలాగే డిసెంబర్ నెలలో ముంబై నగరంలో నిర్వహించిన అనిత శ్రీమంతం వేడుకలలో కూడా పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొట్టింది.నువ్వు నేను సినిమా అనంతరం హీరోయిన్ అనిత హిందీ బుల్లితెరపై దృష్టి పెట్టి యే మొహబ్బతే, నాగిని వంటి లాంటి హిట్ సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.