వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించి బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉప్పెన సినిమా మరో మూడు రోజుల్లో విడుదల కానుంది.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి.
సుకుమార్ శిష్యుడు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఊహించని విధంగా క్లైమాక్స్ ఉండనుందని తెలుస్తోంది.క్లైమాక్స్ లో హీరో చచ్చిపోతాడని హీరో పురుషాంగం కట్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.అయితే ఈ సినిమాలో కొత్త హీరో, కొత్త హీరోయిన్ నటిస్తుండగా కొత్త బుచ్చిబాబు డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నా ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
తొలి సినిమాకే ఇంత భారీగా అంచనాలు ఏర్పడటం ఒక విధంగా ప్లస్ అయితే మరో విధంగా మైనస్ అవుతోంది.భారీ అంచనాల వల్ల తొలిరోజు ఈ సినిమాకు ఊహించని స్థాయిలో కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.

అయితే కొత్త హీరో, కొత్త హీరోయిన్, కొత్త డైరెక్టర్ కావడంతో ఏ మాత్రం అంచనాలు అందుకోలేకపోయినా సినిమా ఫ్లాప్ గా నిలిచే అవకాశం ఉంది.యువతలో చాలామంది ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ప్రోమోలు, పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి.అవసరానికి మించి ఈ సినిమాపై అంచనాలు పెరగడంతో అంచనాలను అందుకోలేకపోతే మాత్రం నష్టపోతే అవకాశం ఉంటుంది.
స్టార్ డైరెక్టర్లు కూడా ఈ సినిమా గురించి ఇప్పటికే పాజిటివ్ గా చెప్పిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి హీరోయిన్ తండ్రి పాత్రలో నటిస్తున్నారు.
విజయ్ సేతుపతి నటిస్తున్న సినిమాలు ఈ మధ్య కాలంలో హిట్టవుతూ ఉండటంతో ఉప్పెన సినిమా కూడా హిట్ అవుతుందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.







