ఏపీ రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్..!! 

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఏపీ రైతుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ అనేక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో రైతు రక్షణకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు.రాష్ట్రంలో రైతులకు రక్షణగా పోలీస్ వ్యవస్థ ఉండాలని సూచించారు.

ప్రత్యేకంగా ఈ రైతు పోలీస్ స్టేషన్ లోనే అన్ని సమస్యలు తీరి పోవాలని,  న్యాయపరమైన చిక్కులు సత్వరమే పరిష్కరించడానికి పోలీస్ స్టేషన్లు సహకరించేలా వ్యవస్థ ఉండాలని దిశా హెల్ప్‌ డెస్క్‌ మాదిరిగా రైతుల కోసం ఒక డెస్క్‌ ఏర్పాటు చేయాలనుకుంటున్నామని’ సీఎం జగన్ తెలిపారు.తాజాగా పోలీస్ వ్యవస్థ పై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

అంతేకాకుండా గ్రామ వార్డు, సచివాలయంలో మహిళా పోలీసులకు అవగాహన కల్పించే విధంగా దిశ యాప్‌ రూపకల్పన ఉండాలని కూడా సూచించారు.  

Advertisement
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు