షూటింగ్‌లో ప్రమాదం.. అజిత్ రేంజ్ యాక్షన్‌ సీన్‌ ట్రై చేసిన సంపూ

బర్నింగ్‌ స్టార్ సంపూర్నేష్‌ బాబు ప్రస్తుతం ‘బజార్‌ రౌడీ’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.హృదయ కాలేయం సినిమా నుండి కూడా సంపూర్నేష్‌ బాబు హీరో రేంజ్ లోనే ఫీట్ లను చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు.

 Small Accident In Sampoornesh Babu Bazar Rowdy Movie Shooting,hridaya Kaaleyam,b-TeluguStop.com

కామెడీగా ఉన్నా మరెలా ఉన్నా కూడా వాటిని పట్టించుకోకుండా తనకు తోచింది చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.షూటింగ్‌ సందర్బంగా సంపూ పడే కష్టం గురించి ఆమద్య ఒక దర్శకుడు చెప్పుకొచ్చాడు.

భారీ డైలాగ్ ను సింగిల్ టేక్‌ లో చెప్పడం, కష్టమైన డాన్స్ స్టెప్పులను ఎంతో కష్టపడి నేర్చుకుని మరీ వేయడం వంటివి చేస్తూ ఉన్నాడు.తాజాగా బజార్‌ రౌడీ సినిమా కోసం కూడా ఒక సాహస సన్నివేశాన్ని ట్రై చేశాడు.

అది కాస్త వికటించడంతో మొత్తం తలకిందులు అయ్యింది.సంపూర్నేష్‌ బాబు గాయాలతో బయట పడ్డాడు.

అదృష్టం బాగుండి గాయాలు మాత్రమే కాస్త అటు ఇటు అయ్యి ఉంటే ప్రాణాలు పోయేవి.

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

మామూలుగా సంపూర్నేష్‌ బాబు చేసే సీన్స్‌ మరియు పాటలు అన్ని కూడా నవ్వు పుట్టించేవే.కాని బజార్‌ రౌడీ సినిమాలో ఆయన చేసిన షాట్ మాత్రం ఒల్లు గగుర్లు పొడిచే విధంగా ఉంది అనడంలో సందేహం లేదు.

అద్బుతమైన యాక్షన్‌ సన్నివేశాలను ప్రేక్షకులకు చూపించాలనే ఉద్దేశ్యంతో అజిత్‌ రేంజ్ లో బైక్‌ రైడింగ్‌ లు మరియు జంపింగ్ లు ప్లాన్‌ చేశాడు.అది కాస్త ఇలా దెబ్బ కొట్టింది.

బజార్‌ రౌడీ సినిమా షూటింగ్‌ ఇటీవలే ముగింపు దశకు వచ్చిందని యూనిట్‌ సభ్యులు చెప్పారు.ఈ యాక్షన్‌ సన్నివేశం కూడా పూర్తి అయినట్లయితే షూటింగ్‌ పూర్తి అవుతుంది.

సమ్మర్ లో సినిమాను విడుదల చేయాలని భావించారు.కాని షూటింగ్‌ లో ప్రమాదం కారణంగా సంపూర్నేష్‌ బాబుకు స్వల్పంగా గాయాలు అయ్యాయి.

వాటి నుండి కోలుకుని వెంటనే సంపూ మళ్లీ ఆ యాక్షన్‌ సీన్‌ ను పూర్తి చేయాలని భావిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube