న్యూస్ రౌండప్ టాప్ 20

1.

అక్షర్యాన్ వెబ్ సైట్ ప్రారంభించిన కవిత

మహిళలపై జరుగుతున్న వేధింపులపై  పోరాడుతున్న తెలుగు మహిళా రచయితల ఫోరం - అక్షర్యాన్ వెబ్ సైట్ ను టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు

2.

ఆచార్య రాధా మోహన్ కు పద్మశ్రీ పురస్కారం

ఒడిషాలోని నయాగడ్ జిల్లాకు చెందిన ప్రముఖ వ్యవసాయ వేత్త ఆచార్య రాధామోహన్ పద్మశ్రీ అవార్డు వరించింది.ఈ మేరకు కేంద్రం పద్మ పురస్కారం జాబితాను విడుదల చేసింది.

3.ఏప్రిల్ 18 న నీట్ పీజీ

నీట్ పీజీ ప్రవేశ పరీక్ష తేదీ ఖరారైంది.ఈ ఏడాది ఏప్రిల్ 18న నీట్ పీజీ ఎంట్రెన్స్ నిర్వహించాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ నిర్ణయించింది.

4 జూన్ రెండో వారంలో ఎంసెట్

వచ్చే విద్యా సంవత్సరం ( 2021-22 ) ఎంసెట్ ను జూన్ రెండో వారంలో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి భావిస్తోంది.

5.పులి కోసం కొనసాగుతున్న గాలింపు

కొమురం భీం జిల్లా ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న పులి కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.పులి బంధించేందుకు ఎక్కడికక్కడ బోన్లను ఏర్పాటు చేశారు.

6.420 కోళ్లు మృతి

మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం కన్నెపల్లిలో నాటు కోళ్లు మృతి కలకలం రేపుతోంది.ఓకే రైతుకు చెందిన 420 కోళ్లు మృతి చెందడంతో బర్డ్ ఫ్లూ అని అనుమానిస్తున్నారు.

7.తెలంగాణలో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 249 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

8.కొవాగ్జిన్ వికటిస్తే నష్టపరిహారం

భారత్ బయోటెక్ అందిస్తున్న వ్యాక్సిన్ తీసుకున్నవారికి దుష్ఫలితాలు వస్తే బాధితులకు తగిన చికిత్స అందించడంతో పాటు, నష్టపరిహారం కూడా చెల్లించే ఏర్పాటు చేశారు.

9.దేశ వ్యాప్తంగా ప్రారంభమైన కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ

Advertisement

దేశవ్యాప్తంగా కోవిడ్ వాక్సిన్ ప్రక్రియ మొదలైంది.వర్చువల్ ద్వారా వ్యాక్సిన్ ప్రక్రియను ప్రధాని మోదీ ప్రారంభించారు.

10.దేశంలోనే మొదటి ఎయిర్ టాక్సీ సర్వీస్

దేశంలోనే మొట్టమొదటి ఎనిమిది టాక్సీ సర్వీస్ చండీఘడ్ లో ప్రారంభమైంది.హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దీనిని ప్రారంభించారు.

11.మిథున్ చక్రవర్తి ప్రేయసిగా శృతిహాసన్

శృతిహాసన్ మిథున్ చక్రవర్తి ముఖ్యపాత్రల్లో హిందీలో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. ది బెస్ట్ షెల్లర్ షీ రోట్ " అనే నవల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కబోతోంది.

12.టీఆర్పీ కేసులో అర్ణబ్ గోస్వామికి ఊరట

టి ఆర్ పి స్కాన్ కు సంబంధించి ఆంగ్ల వార్తా చానల్ పబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్ణబ్ గోస్వామి కి ఊరట లభించింది.ఆయనతో పాటు ఇతర ఉద్యోగులకు జనవరి 29 వరకు ఎలాంటి చర్యలు తీసుకోబోమని ముంబై పోలీసులు హై కోర్ట్ కు తెలిపారు.

13.రైతు సంఘం నేత బల్ దేవ్ సింగ్ సిర్సాకు ఎన్ ఐ ఎ సమన్లు

నూతన వ్యవసాయ చట్టాల పై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్న రైతు సంఘాల లోక్పాల్ ఇన్సాఫ్ వెల్ఫేర్ సొసైటీ కూడా ఉంది.తాజాగా దీని అధ్యక్షుడు బల్ దేవ్ సింగ్ సిర్సాకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ జారీచేసింది.

14.రామ మందిరానికి విరాళాల సేకరణ

అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి అవసరమైన విరాళాల సేకరణ నేటి నుండి ప్రారంభం కానుంది.రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ సభ్యులు తొలి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నుంచి స్వీకరించనున్నారు.

15.డాక్టర్ రెడ్డీస్ కు డి సి జి ఐ గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ కు చెందిన డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ కీలక ప్రకటన చేసింది.రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ వ్యాక్సింగ్ కు సంబంధించి భారత్ లో త్వరలోనే మూడోదశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించనున్నట్లు తెలిపింది.

16.కరోనా వ్యాక్సిన్ .వెనక్కి తగ్గిన ఈటెల

తెలంగాణ లో తొలి కరోనా వేసుకుంటాను ప్రకటించిన ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెనక్కి తగ్గారు.తొలి టీకా ఆయన వేసుకోలేదు.కరోనా టీకాను పారిశుద్ధ్య కార్మికులు, హెల్త్ వర్కర్స్ కు మాత్రమే ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయడంతో ఆయన వెనక్కి తగ్గారు.

17.టీకా వేయించుకున్న సీరమ్ అధినేత

కరోనా టీకా దేశ వప్తంగా మొదలైంది.తొలి టీకా అందించిన శ్రీ రామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత అధర్ పునావాలా కూడా నేడు టీకా తీసుకున్నారు.

18.20 లక్షలు దాటిన కరోనా మరణాలు

ప్రపంచవ్యాప్తంగా కరుణ మహమ్మారి తో మరణించిన వారి సంఖ్య 20 లక్షలు దాటింది.ఈ విషయాన్ని జాన్స్ హోప్ కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకటించింది.

19.కోవి షీల్డ్ టీకా కు నేపాల్ అనుమతి

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!

భారత్ లో తయారవుతున్న కోవి షీల్డ్ టీకా కు పొరుగు దేశమైన నేపాల్ కూడా అనుమతి ఇచ్చింది.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 47,910 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 48,910 .

Advertisement

తాజా వార్తలు