ఆ రెండు పార్టీలు కుమ్మక్కు అయిపోయాయి అంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి..!!

కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బీజేపీ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు వర్షం కురిపించారు.

కార్పొరేట్ శక్తుల చేతిలో బిజెపి ప్రభుత్వం కీలుబొమ్మగా మారిందని కేంద్ర ప్రభుత్వం పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి రైతులను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.ఇదే తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో కేసిఆర్ దుర్మార్గమైన పాలన చేస్తున్నారని విమర్శించి, రైతులు పండిస్తున్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామాలలో ఐకేపీ కేంద్రాల ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలని పేర్కొన్నారు.పంట కొనుగోలు విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే ఉత్పత్తులను కొనుగోలు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీని హెచ్చరించారు.తెలంగాణ రాష్ట్రం కేసిఆర్ జాగీరు కాదని పేర్కొన్నారు.

ఇదే రీతిలో త్వరలో జరగబోయే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ కూడా రాదని జోస్యం చెప్పారు.ఐదు దశాబ్దాలుగా నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పథంలో నడిపిస్తున్న జానారెడ్డి లాంటి వ్యక్తిని నియోజకవర్గ ప్రజలు గెలిపించుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.

Advertisement
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

తాజా వార్తలు