కోరిన మొక్కులు తీర్చే.. వేములవాడ రాజన్న!

మన భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా మనకు శివుని ఆలయాలు దర్శనమిస్తుంటాయి.దేశవ్యాప్తంగా శివాలయాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి.

ఈ తరహాలోనే రాజరాజేశ్వరి ఆలయంగా, భాస్కర క్షేత్రంగా, హరి హరి క్షేత్రంగా ఎంతో ప్రసిద్ధిచెందినది వేములవాడ రాజరాజేశ్వరాలయం.కోడె మొక్కులు స్వామిగా, కోరిన కోరికలు తీర్చే ఆలయంగా ప్రసిద్ధి చెందినదే ఈ వేములవాడ రాజన్న ఆలయం.

అయితే ఈ ఆలయం ప్రత్యేకతలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.సాధారణంగా భారత దేశంలో హిందువులు మాత్రమే హిందూ దేవాలయాలను దర్శిస్తారు.

కానీ తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలో ఉన్న ఈ వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో హిందువులతో పాటు ముస్లిములు కూడా ఆ శివయ్యను దర్శించుకుంటారు.పురాణాల ప్రకారం అర్జునుడి మునిమనుమడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపటం వల్ల కలిగిన పాపం నుంచి విముక్తి పొందటానికి దేశం మొత్తం తిరుగుతూ ఈ ఆలయాన్ని చేరుకుంటాడు.

Advertisement

అక్కడ ఉన్న ధర్మ గుండంలో స్నానం చేస్తున్న నరేంద్రుడికి శివలింగం కనిపించటంతో ఆ శివలింగాన్ని ప్రతిష్టించి పూజించాడు.అప్పుడు శివుడు ప్రత్యక్షమై రోషిని చంపిన పాపం నుంచి నరేంద్రుడికి విముక్తిని కలిగించాడు.

ఆ శివలింగమే ఇప్పుడు ఉన్న ఆలయంలో మూల విరాట్ విగ్రహమని పురాణాలు చెబుతున్నాయి.

ఈ ఆలయంలో స్వామివారికి కుడిపక్కన రాజరాజేశ్వరి అమ్మవారు ఎడమవైపు లక్ష్మీ సమేత సిద్ధి వినాయక విగ్రహాలు ఉంటాయి.ఈ ఆలయంలో కోడే మొక్కుకు ఎంతో ప్రాధాన్యత ఉంది.కోడెలతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆవరణంలో కట్టేయడం వల్ల భక్తుల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం.

అంతే కాకుండా ఈ ఆలయంలో ఉన్న గండ దీపాన్ని వెలిగిస్తే వారికున్న మరణ గండం తొలగిపోతుందని భక్తులు ఎక్కువగా విశ్వసిస్తారు.ప్రతి సంవత్సరం శివరాత్రి పండుగ దినాన్ని పురస్కరించుకొని పెద్దఎత్తున భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఆరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగుతుంది.

Advertisement

తాజా వార్తలు