కోరిన మొక్కులు తీర్చే.. వేములవాడ రాజన్న!

మన భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా మనకు శివుని ఆలయాలు దర్శనమిస్తుంటాయి.దేశవ్యాప్తంగా శివాలయాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి.

ఈ తరహాలోనే రాజరాజేశ్వరి ఆలయంగా, భాస్కర క్షేత్రంగా, హరి హరి క్షేత్రంగా ఎంతో ప్రసిద్ధిచెందినది వేములవాడ రాజరాజేశ్వరాలయం.

కోడె మొక్కులు స్వామిగా, కోరిన కోరికలు తీర్చే ఆలయంగా ప్రసిద్ధి చెందినదే ఈ వేములవాడ రాజన్న ఆలయం.

అయితే ఈ ఆలయం ప్రత్యేకతలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.సాధారణంగా భారత దేశంలో హిందువులు మాత్రమే హిందూ దేవాలయాలను దర్శిస్తారు.

కానీ తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలో ఉన్న ఈ వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో హిందువులతో పాటు ముస్లిములు కూడా ఆ శివయ్యను దర్శించుకుంటారు.

పురాణాల ప్రకారం అర్జునుడి మునిమనుమడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపటం వల్ల కలిగిన పాపం నుంచి విముక్తి పొందటానికి దేశం మొత్తం తిరుగుతూ ఈ ఆలయాన్ని చేరుకుంటాడు.

అక్కడ ఉన్న ధర్మ గుండంలో స్నానం చేస్తున్న నరేంద్రుడికి శివలింగం కనిపించటంతో ఆ శివలింగాన్ని ప్రతిష్టించి పూజించాడు.

అప్పుడు శివుడు ప్రత్యక్షమై రోషిని చంపిన పాపం నుంచి నరేంద్రుడికి విముక్తిని కలిగించాడు.

ఆ శివలింగమే ఇప్పుడు ఉన్న ఆలయంలో మూల విరాట్ విగ్రహమని పురాణాలు చెబుతున్నాయి.

"""/" / ఈ ఆలయంలో స్వామివారికి కుడిపక్కన రాజరాజేశ్వరి అమ్మవారు ఎడమవైపు లక్ష్మీ సమేత సిద్ధి వినాయక విగ్రహాలు ఉంటాయి.

ఈ ఆలయంలో కోడే మొక్కుకు ఎంతో ప్రాధాన్యత ఉంది.కోడెలతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆవరణంలో కట్టేయడం వల్ల భక్తుల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం.

అంతే కాకుండా ఈ ఆలయంలో ఉన్న గండ దీపాన్ని వెలిగిస్తే వారికున్న మరణ గండం తొలగిపోతుందని భక్తులు ఎక్కువగా విశ్వసిస్తారు.

ప్రతి సంవత్సరం శివరాత్రి పండుగ దినాన్ని పురస్కరించుకొని పెద్దఎత్తున భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.

ఆరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగుతుంది.

పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచిన బిగ్ బాస్8 సోనియా ఆకుల.. కంగ్రాట్స్ అంటూ!