అనతి కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు జానీ మాస్టర్.స్టార్ హీరోల సినిమాల్లో మాస్ పాటలకు ఎక్కువగా కొరియోగ్రాఫర్ గా పని చేసిన జానీ మాస్టర్ హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఈరోజు జే1 వర్కింగ్ టైటిల్ తో జానీ మాస్టర్ సినిమా పోస్టర్ విడుదలైంది.సుజీ విజువల్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాకు మురళీ రాజ్ దర్శకునిగా వెంకట రమణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
హీరోగా మారడం గురించి జానీ మాస్టర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ తన లైఫ్ లో నెక్స్ట్ లెవెల్ స్టెప్ తీసుకున్నానని.అభిమానుల అశీస్సులు కావాలని కోరారు.
కొన్ని రోజుల క్రితం జానీ మాస్టర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఒక సినిమా తెరకెక్కుతుందని వార్తలు రాగా ఊహించని విధంగా జానీ మాస్టర్ హీరోగా మారడం గమనార్హం.గతంలో ప్రభుదేవా, లారెన్స్ కొరియోగ్రాఫర్లుగా పని చేసి హీరోలుగా మారారు.

లారెన్స్ హీరోగా వరుస విజయాలతో హర్రర్ సినిమాల ద్వారా సినిమాసినిమాకు మార్కెట్ రేంజ్ ను పెంచుకుంటున్నారు.హైదరాబాద్ లో నేడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.డ్యాన్సర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న జానీ మాస్టర్ హీరోగా సక్సెస్ సాధిస్తారో లేదో చూడాల్సి ఉంది.
జానీ మాస్టర్ హీరోగా మారుతుండటంతో పవన్ ప్రాజెక్ట్ అటకెక్కినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అయితే హీరోగా జానీ సక్సెస్ మాస్టర్ సక్సెస్ అయినా కాకపోయినా భవిష్యత్తులో ఆయన డైరెక్టర్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు.అయితే జానీ మాస్టర్ హీరోగా మారుతున్న నేపథ్యంలో ఇకపై ఆయన ఇతర హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా చేస్తారో లేదో తెలియాల్సి ఉంది.
ఇప్పటివరకు 150కు పైగా పాటలకు జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా చేశారు.