దాదాపు మూడు దశాబ్దాల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫైట్ మాస్టర్లుగా కొనసాగుతూ రామ్ లక్ష్మణ్ తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో పని చేసిన రామ్ లక్ష్మణ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమ జీవితాల గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.
చిన్నప్పటి నుంచి తమ మధ్య ఎటువంటి గొడవలు రాలేదని ఎప్పుడూ కొట్టుకోవాల్సిన అవసరం రాలేదని రామ్ లక్ష్మణ్ తెలిపారు.
చిన్నప్పటి నుంచి ఒకే తరహా డ్రెస్సులు వేసుకోవడానికి ఇష్టపడేవాళ్లమని అదే తమకు అలవాటుగా మారిందని రామ్ లక్ష్మణ్ తెలిపారు.
ప్రతి ఒక్కరి లైఫ్ లో తొలి పాతిక సంవత్సరాలు పిల్లర్ లాంటిదని.ఆ తర్వాత పాతిక సంవత్సరాలలో పెళ్లి, పిల్లలు, ఉద్యోగంలతో పాటు మన గురించి మనం తెలుసుకొని ఉన్నతంగా స్థిరపడాలని సూచించారు.
ప్రతిరోజూ గంటపాటు వ్యాయామం చేయాలని. సిగరెట్లు, మందు, అర్ధరాత్రి బిర్యానీలు తింటూ శరీరాన్ని మలినం చేయకూడదని చెప్పారు.

ప్రతి మనిషి జీవితంలో చదువుకు ఎంతో ముఖ్య పాత్ర ఉందని.అయితే చదువు లేకపోయినా జీవించవచ్చనే ధైర్యం తమలో ఉందని అన్నారు.బాలీవుడ్ సినిమాలు చేసే సమయంలో భాష సమస్య ఉంటుందని రామ్ లక్ష్మణ్ చెప్పారు.చిన్నప్పుడు తమ ఊరిలో ఒక బండరాయి ఉండేదని.బరువుగా ఉండే బండరాయిని ఏడాది పాటు ప్రాక్టీస్ చేసి ఒకరోజు కష్టపడి ఎత్తామని.ఆ బండరాయి వల్లే మనస్పూర్తిగా ప్రయత్నిస్తే సక్సెస్ అవుతామని అర్థమైందని రామ్ లక్ష్మణ్ తెలిపారు.
ఒకరిపై మరొకరికి సాధారణంగా కోపం రాదని అయితే కొన్ని సందర్భాల్లో షూటింగ్ సమయంలో ఒకరిపై మరొకరం సీరియస్ అవుతుంటామని.తర్వాత మళ్లీ కలిసిపోతుంటామని రామ్ లక్ష్మణ్ వెల్లడించారు.
అరవై సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఫైట్ మాస్టర్లుగా ఉండి ఆ తరువాత ధ్యాన ప్రపంచంలోకి వెళతామని చెప్పారు.