ఏపీలో ఎప్పుడూ సంచలనంగా ఉండే కృష్ణా జిల్లాలో అధికార వైసీపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి.రేసులో ముందు ఉంటారు ? అనుకున్న నేతలు వెనక్కు వెళ్లిపోతుంటే రేసులో వెనక ఉన్న నేతలు అనూహ్యంగా ముందుకు వస్తున్నారు.జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న బీసీ వర్గానికి చెందిన మాజీ మంత్రి, పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి కేబినెట్ రేసులో వెనక్కు వెళ్లిపోతుంటే.మరో బీసీ నేత, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ముందుకు వస్తోన్న పరిస్థితే కనిపిస్తోంది.
ప్రస్తుతం జిల్లాలో జోగికి అనుకూలంగా చర్చలు నడుస్తున్నాయి.
వాస్తవానికి గతంలో ఉయ్యూరు, ఆ తర్వాత పెనమలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సారథి 2009 గెలుపు తర్వాత నాడు వైఎస్,ఆ తర్వాత రోశయ్య , కిరణ్ కుమార్ కేబినెట్లలో మంత్రిగా పనిచేశారు.2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి బందరు ఎంపీగా ఓడిన ఆయన గత ఎన్నికల్లో పెనమలూరు నుంచి మూడోసారి ఎమ్మెల్యే అయ్యారు.బీసీ ( యాదవ వర్గం) కోటాలో ఆయనకు మంత్రి పదవి రావాల్సి ఉన్నా.
జగన్‌కు ఎప్పటి నుంచో నమ్మినబంటుగా ఉన్న నెల్లూరు జిల్లాకు చెందిన అనిల్ కుమార్ యాదవ్‌కు మంత్రి పదవి వచ్చింది.

అయితే రెండున్నరేళ్ల తర్వాత ( మరో ఏడనిమిది నెలల్లో) జరిగే ప్రక్షాళనలో అయినా సారథికి మంత్రి పదవి వస్తుందన్న అంచనాలు ఉండగా.ఇప్పుడు అవి గల్లంతు కానున్నాయంటున్నారు.జగన్ అనిల్‌ను కేబినెట్ నుంచి తప్పించరనే అంటున్నారు.
ఇక బీసీ ( గౌడ వర్గం) కోటాలో జిల్లాకే చెందిన జోగి రమేష్‌కు మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.ఇందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి.
మంత్రి పదవి రాలేదని సారథి పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా లేరు.
జోగి మాత్రం ఉన్నంతలో దూకుడుగా ఉండడంతో పాటు పార్టీ కోసం జిల్లాలో బీసీలను ఐక్యం చేస్తున్నారన్న ఫీడ్‌బ్యాక్ జగన్ దగ్గర ఉందంటున్నారు.
అదే సమయంలో ధర్మాన లాంటి సీనియర్లు మంత్రి పదవి లేకపోయినా అసెంబ్లీలో, బయటా వాక్చాతుర్యంతో ప్రభుత్వానికి అండగా ఉంటున్నారు.అదే సమయంలో మాజీ మంత్రిగా, సీనియర్ నేతగా ఉన్న సారథి సైలెంట్ అవ్వడంతో రేసులో వెనకపడ్డారే అంటున్నారు.
ఏదేమైనా జోగి ఫేట్ త్వరలోనే మారుతుందన్న అంచనాలు ఎంత వరకు నిజం అవుతాయో ? చూడాలి.