అక్కడ ఇక్కడ ఓటు... కవితపై అనర్హత వేటు వేయాలి

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టి‌ఆర్‌ఎస్ ఎం‌ఎల్‌సి కల్వకుంట్ల కవితపై ఈ‌సి కి ఫిర్యాధు చేశారు.

కరీంనగర్ జిల్లాలో ఓటు హక్కు ఉన్న కవిత హైదరాబాద్ లో ఓటు వెయ్యడంపై సి‌ఈ‌సి కి ఫిర్యాదు చేశాము అన్నారు.

ప్రదాని నరేంద్ర మోడి గారు ఫోన్ చేసి జి‌హెచ్‌ఎం‌సి ఎలక్షన్స్ లో బి‌జే‌పి పొరాడిన తీరును అభినందించారు.అదేవిదంగా టి‌ఆర్‌ఎస్, ఎం‌ఐ‌ఎం నేతలు చేస్తున్న అరాచకాలను వివరించాము అన్నారు.

దుబ్బాక ఉప ఎన్నికల్లో బి‌జే‌పి గెలిచిన తీరును అభినందించారు.మోడి గారి ఫోన్ రాకతో పార్టీలోనూ, కార్యకర్తల్లోనూ నూతన ఉత్తేజం వచ్చిందని, మరింత ఉత్సాహంతో పనిచేస్తాం అని బండి సంజయ్ అన్నారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బి‌జే‌పి గెలిచి తీరుతుంది.టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలపై ప్రజలు విసిగిపోయారు.తెలంగాణలో కే‌సి‌ఆర్ కుటుంబ పాలన నడుస్తుందని ఎద్దేవా చేశారు.

Advertisement

టి‌ఆర్‌ఎస్ మహిళా ఎం‌ఎల్‌సి కవిత హైదరాబాద్ లో ఓటు వినియోగించుకోవడంపై ఎన్నికల సంఘం క్లారిటి ఇచ్చింది.బోదాన్ లో తన ఓటును రద్దు చేసుకున్నారు అని వివరణ ఇచ్చింది.

కవిత విషయంలో బీజేపీ నాయకులు అత్యుత్సాహం చూపుతున్నారంటూ టీఆర్‌ఎస్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.కవిత గారు అక్కడ ఓటు హక్కును రద్దు చేసుకుని చాలా రోజులే అయ్యిందనే విషయాన్ని టీఆర్‌ఎస్‌ నాయకులు గుర్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు