కార్పోరేట్ లంచం.. అభివృద్ధికి గ్రహణం: ఇండియా స్థానం ఎక్కడంటే..?

లంచం.భారతదేశాన్నే కాదు ప్రపంచంలోని ఎన్నో దేశాలను పట్టి పీడిస్తున్న సమస్యలలో అత్యంత ప్రధానమైనది.

ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల పాలిట గ్రహణం.సామాన్య ప్రజల పాలిట శాపం.

భారతదేశంలో నూటికి 90 మంది లంచం బారినపడ్డవారే.మన దేశంలో ఛోటా, బడా బాబులన్న తేడా లేకుండా చాలామందిని "లంచగొండి వ్యాధి" పట్టి పీడిస్తోంది.

తమ కర్తవ్యాలకు ప్రభుత్వ/ప్రైవేటు సంస్థలు వేతనాలు చెల్లిస్తున్నా.ఈజీ మనీకు అలవాటుపడిన కొందరు అమాయకుల జేబులు కొల్లగొడుతున్నారు.

Advertisement

కోట్లకు పడగెత్తిన కార్పోరేట్ సంస్థలను సైతం ఈ "లంచగొండి వ్యాధి" సోకిన వారు పీడిస్తున్నారు.చివరికి రతన్ టాటాను సైతం ఓ కేంద్ర మంత్రి లంచం అడిగారట.90వ దశకంలో భారత్‌లో ఓ పౌరవిమానయాన సంస్థను స్థాపించడానికి సదరు కేంద్ర మంత్రి రూ.15 కోట్ల లంచం అడిగారని రతన్ టాటా స్వయంగా ఓ సమావేశంలో చెప్పారు.దేశంలో చాలా వరకూ బడా కార్పోరేట్ కంపెనీలు తమ స్వంత పనులను సానుకూలంగా పూర్తి చేసుకునేందుకు లంచాలు ముట్టజెప్తున్నాయని ఎన్నో సర్వేల్లో తేలింది.

ఈ నేపథ్యంలో బిజినెస్ బ్రైబరీ రిస్క్ ఇండెక్స్ 2020లో భారత్ 77వ స్థానంలో నిలిచింది.మొత్తం 194 దేశాల జాబితాలో 45 స్కోర్‌తో భారత్ 77వ స్థానంలో నిలిచింది.యాంటీ–బ్రైబరీ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ‘ట్రేస్’ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడించింది.

గతేడాది జాబితాలో 78వ స్థానంలో ఉన్న భారత్.ఈసారి ఒక్క స్థానం ఎగబాకింది.

ఉత్తర కొరియా, తుర్క్‌మెనిస్థాన్, దక్షిణ సూడాన్, వెనుజులా, ఎరిత్రియాలలో వాణిజ్య లంచాల ముప్పు అత్యంత ఎక్కువ ఉన్నట్టు ట్రేస్ సంస్థ తేలింది.డెన్మార్క్, ఫిన్లాండ్, స్వీడన్, న్యూజిలాండ్‌లో రిస్క్ తక్కువగా ఉన్నట్టు వెల్లడయ్యింది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

గత సంవత్సరం 48 స్కోర్‌తో 78వ స్థానంలో ఉన్న భారత్.ఈ ఏడాది మాత్రం 45 పాయింట్లతోనే 77వ స్థానంలో నిలిచింది.

Advertisement

ప్రభుత్వంతో వ్యాపార సంస్థల పరస్పర చర్యలు, అవినీతి నిరోధకత- అమలు, ప్రభుత్వం- పౌర సేవల పారదర్శకత, మీడియా పాత్ర సహా పౌర సమాజ పర్యవేక్షణ ఈ నాలుగు అంశాల ఆధారంగా జాబితాను రూపొందించారు.భారత్ 77వ స్థానంలో ఉన్నా పొరుగు దేశాలైన పాకిస్థాన్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్ కంటే పరిస్థితి మెరుగ్గా ఉండటం సానుకూలంశం.

మన పొరుగునే వున్న చిన్న దేశం భూటాన్ 37 స్కోర్‌తో 48వ స్థానంలో నిలబడింది.ఇక ఆసియా దిగ్గజం చైనా తన బ్యూరోక్రసీని క్రమబద్ధీకరించడం వల్ల అధికారులు లంచం డిమాండ్ చేసే అవకాశాలను తగ్గించడానికి ప్రయత్నిస్తోందని ట్రేస్ బ్రైబరీ రిస్క్ మ్యాట్రిక్స్ పేర్కొంది.

ఇండియాతోపాటు పెరూ, జోర్డాన్, ఉత్తర మాసిడోనియా, కొలంబియా, మాంటినెగ్రోలు 45 పాయింట్లు సాధించాయి.సోమాలియా ర్యాంకు మరింత దిగజారింది.

ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య లంచం ముప్పు గురించి మరింత నమ్మకమైన, సూక్ష్మమైన సమాచారం సహా వ్యాపార అవసరాలను తీర్చడానికి తొలిసారిగా 2014లో ట్రేస్ ఇండెక్స్‌ను ప్రచురించింది.ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంక్, గోథెన్‌బర్గ్ యూనివర్సిటీకి చెందిన వి-డెమ్ ఇన్‌స్టిట్యూట్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌తో సహా ప్రముఖ అంతర్జాతీయ సంస్థల నుంచి సమాచారాన్ని సేకరించి మ్యాట్రిక్స్ ఈ జాబితాను రూపొందిస్తుంది.

ఈ డేటా ప్రతి దేశంలో లంచం డిమాండ్ల ముప్పు అంచనా వేయడానికి, దానికి అనుగుణంగా తగిన చర్యలు తీసుకోడానికి సంస్థలకు సహాయపడుతుంది.

తాజా వార్తలు