'ట్విట్టర్' లో 'సోనూసూద్' కు పెళ్లి పిలుపు... వస్తానంటూ?

గత కొన్ని నెలల నుండి ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి గురించి అందరికీ తెలిసిందే.

అంతేకాకుండా కరోనా బాధితులకు అండగా ఉంటూ తన వంతు సాయం చేస్తున్న సోనూసూద్ గురించి అంతా ఇంతా కాదు.

ఎంతో మంది బాధితులకు తన వంతు సహాయం తో తమ గుండెల్లో దేవుడు గా నిలిచిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.అంతేకాకుండా ఈ మధ్యే గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న నాలుగు నెలల చిన్నారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.

ఈ క్రమంలో కరోనా సమయం నుండి తన వంతు సాయంతో ముందుకు వచ్చి తన మంచితనాన్ని చాటిచూపారు.కాగా సోషల్ మీడియాలో తనకి వస్తున్నా ఆహ్వానములను సోనూసూద్ వెంటనే స్పందిస్తున్నారు.

సోనూసూద్ కు ట్విట్టర్ లో పెళ్లి పిలుపు రాగానే వెంటనే స్పందించారు.బీహార్ కు చెందిన నేహా అనే అమ్మాయి ట్విట్టర్ లో సోనూసూద్ కు వివాహ ఆహ్వానాన్ని చేయగా సోనూసూద్ వెంటనే స్పందించారు.

Advertisement

నేహ సోదరి దివ్య అనారోగ్యంతో బాధ పడగా సోను సూద్ సహాయం చేశారని నేహా తెలిపింది.తన మంచితనం వల్ల అతని పేరు ప్రతి ఒక్కరి నోటి నుండి వస్తుంది.

అతను ప్రజలకు చేస్తున్న సహాయం గురించి, అతని మంచి గురించి సోషల్ మీడియాలో హల్ చల్ అవుతుంది.

కాగా నేహా సోనూసూద్ ను ఒక వివాహానికి ఆహ్వానం చేయగా.క్షమించండి సార్ ఎక్సైట్ మెంట్ లో మీ పేరు రాయడం మర్చిపోయాను అని తెలిపింది.అంతేకాకుండా మీ కోసం ఎదురు చూస్తాను అంటూ మీరు తప్పక పెళ్లికి రావాలని కోరుతున్నానంటు ట్విట్టర్ లో తెలపగా సోనుసూద్ వెంటనే స్పందించారు.

అంతేకాకుండా బీహార్ పెళ్లి చూద్దాం అంటూ ట్విట్టర్ లో తెలిపారు సోనూసూద్.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు